
సినిమా హిట్టు అయినా సరిగా డబ్బులు రాని పరిస్థితి. అలాంటిది ఏకంగా 11,050 కోట్లు రాబడితే.. ఏంటి ఇది నిజమేనా? అక్షరాలా పచ్చి నిజం. మరి లేటు చేయకుండా మీరు కూడా ఇంకొకరికి ఈ విషయాన్నీ చెప్పేలా పూర్తి మాట చూసేద్దాం.
గేమింగ్ ప్రపంచంలో గత 13 ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఆసక్తి కలిగించే సంచలనాత్మక వీడియో గేమ్ ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ (GTA 6) మార్కెట్లోకి అడుగుపెట్టకముందే సరికొత్త చరిత్ర సృష్టించింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగడం చూస్తుంటాం, కానీ ఒక వీడియో గేమ్ కోసం ఒక్కరు కూడా కనీసం కంట్రోలర్ పట్టుకుని గేమ్ ప్లే ఆడకముందే, కేవలం డిజిటల్ బుకింగ్స్ రూపంలో ఏకంగా 11,000 కోట్లకు పైగా వసూలు చేయడం గేమింగ్ చరిత్రలో మొదటిసారి. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘సెన్సార్ టవర్’ అందించిన తాజా ప్రదర్శన ప్రకారం, నవంబర్ 13 నాటికే ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ కోసం సుమారు 1.21 కోట్ల (12.13 మిలియన్లు) డిజిటల్ ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయి.
వీటి ద్వారా అక్షరాల 1.18 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 11,050 కోట్లు) భారీ రాబడిని ఈ గేమ్ రాబట్టింది. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ కానున్న ఈ అడ్వెంచర్ గేమ్ కోసం యువత ఎంతగా పిచ్చిసెక్కిపోయి ఉన్నారో ఈ అంకెలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోనీకి చెందిన ప్లేస్టేషన్ స్టోర్ (ప్లేస్టేషన్ స్టోర్), మైక్రోసాఫ్ట్ ఎక్స్-బాక్స్ స్టోర్ (Xbox స్టోర్) చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ప్రీ-ఆర్డర్లు దక్కించుకున్న ఏకైక టైటిల్‌గా జీటీఏ 6. సోనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటివరకు ఉన్న ఆల్-టైమ్ రికార్డులను ఈ గేమ్ తుడిచిపెట్టేసిందని అధికారికంగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: అక్కినేని కోడళ్లపై అగ్ర నటి వ్యాఖ్యలు: ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
విశ్లేషకుల అంచనాల ప్రకారం, మొత్తం ప్రీ-ఆర్డర్లలో దాదాపు 75 శాతం అంటే సుమారు 9.08 కాపీలు కేవలం ప్లేస్టేషన్ 5 (PS5) యూజర్ల నుంచే అమ్ముడయ్యాయి. దీనివల్ల ఒక్క ప్లేస్టేషన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దాదాపు 88 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది.
మిగిలిన ప్రీ-ఆర్డర్లు ఎక్స్-బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ (Xbox సిరీస్ X/S) ద్వారా వచ్చాయి. అదనంగా, కొనుగోలుదారులు ఎక్కువగా ఖరీదైన ఎడిషన్ల వైపే మొగ్గు చూపడం విశేషం. సుమారు 89 శాతం మంది గేమర్లు 100 డాలర్ల విలువైన అల్టిమేట్ ఎడిషన్‌ను ఎంచుకోగా, 11 శాతం మంది 80 డాలర్ల స్టాండర్డ్ ఎడిషన్‌ను ప్రీ-ఆర్డర్‌గా తీసుకున్నారు. మరోవైపు, గేమింగ్ ప్రియులు లాంచ్ రోజు ఎలాంటి సర్వర్ సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు రాక్‌స్టార్ గేమ్స్ ముందస్తు డౌన్లోడ్ (ప్రీ-లోడ్) సదుపాయాన్ని కల్పించింది. అయితే, ఈ భారీ గేమ్ సైజ్ కన్సోల్స్‌లో దాదాపు 212GB వరకు ఆక్రమిస్తుందని తేలడంతో గేమర్లు తమ స్టోరేజ్‌ను ముందే సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో వచ్చిన జీటీఏ 5 (GTA 5) గేమ్ మార్కెట్లోకి వచ్చిన తొలి మూడు రోజుల్లో 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. కానీ జీటీఏ 6 మాత్రం అసలు విడుదల కాకముందే ఆ మైలురాయిని దాటేసి, ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది.

నవంబర్ 19న గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న ఈ విజువల్ వండర్ లాంచ్ అయిన మొదటి వారంలోనే రూ. 27,000 కోట్ల నుంచి రూ. 43,000 కోట్లు ($3.3 బిలియన్ల నుంచి $5.2 బిలియన్లు) వరకు వసూలు చేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.అర్ధమయింది ఇది సినిమా కాదు.. వీడియో గేమ్. మన సినిమా ఫక్కిలోనే ఉందని చెప్పుకున్నాం.
మీకు నచ్చవచ్చు:రామోజీ రావు లేటెస్ట్ న్యూస్ వైరల్!
మీకు నచ్చవచ్చు:సాయి పల్లవి తల్లి షాకింగ్ స్పీచ్!
[gta 6 pre orders, Cinema, grand theft auto 6, gta 6 release , hollywood]
