Home సినిమా ‘హుషారు 2’ టీజర్: నారాయణమూర్తి సర్ప్రైజ్ ఎంట్రీ.. ‘టెంపర్’ని కాదని ఈ సినిమా చేయడానికి కారణమేంటి.? – Andhra Waves

‘హుషారు 2’ టీజర్: నారాయణమూర్తి సర్ప్రైజ్ ఎంట్రీ.. ‘టెంపర్’ని కాదని ఈ సినిమా చేయడానికి కారణమేంటి.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా ‘హుషారు’. ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా ‘హుషారు 2’ రాబోతోంది. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈసారి నవ్వులతో పాటు యాక్షన్ చూస్తుంటే గట్టిగానే ఉండేలా టీజర్ రూపొందింది.

‘హుషారు 2’ టీజర్ ఆద్యంతం ఫన్‌తో సాగింది. స్నేహితుల మధ్య సరదా సన్నివేశాలు, యూత్‌ఫుల్ డైలాగ్స్ తో టీజర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. మొదటి భాగంలో ఉన్న ఫీల్‌ను కొనసాగిస్తూనే, ఈసారి మరింత ఎనర్జీతో కథను చెప్పబోతున్నట్లు ప్రారంభించారు. కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉండటంతో ఈ సీక్వెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెరిగినట్టే అనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ప్రత్యేక పాత్రలో నటించడం చాలా ఆసక్తికరంగా మారింది. టీజర్ చివరిలో “తమ్ముళ్లు వేట మొదలెడదామా?” అంటూ నారాయణమూర్తి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.

సాధారణంగా ఇతర సినిమాల్లో ఆర్. నారాయణమూర్తి నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కీలక పాత్రలు ఆఫర్ చేసినా రిజెక్ట్ చేస్తారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘టెంపర్’ సినిమాలో పోసాని కృష్ణమురళి పోషించిన మూర్తి పాత్ర నారాయణమూర్తి కోసం రాసుకున్నదే. అయితే ఆ పాత్రను నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారు.

అలాంటి నారాయణమూర్తి ఇప్పుడు ‘హుషారు 2’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయంపై టీజర్ లాంచ్ ఈవెంట్ లో నారాయణమూర్తి స్పందించారు. దర్శకుడు గొప్ప పాత్ర రాశాడు, అందుకే నటించానని చెప్పారు.

‘హుషారు 2’లో నారాయణమూర్తిది ప్రత్యేక పాత్ర, అందునా మావోయిస్టు దళ నాయకుడి పాత్ర కావడంతోనే ఆయన అంగీకరించి ఉంటారు.

శ్రీహర్ష కొనుగంటి నటిస్తున్న ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్. సంగీతం అందించారు. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కొచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ వూదులూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.?

[R Narayana Murthy In Husharu 2, Husharu 2 Teaser, Husharu 2 Movie, R Narayana Murthy, NTR Temper, Sree Harsha Konnuganti, Rahul Ramakrishna, Ashok Galla, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird