రెగ్యులర్ ఆర్ఐ స్థానంలో సీనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు
ఉన్నతాధికారుల అనుమతులపై సందేహాలు.. విచారణకు ఉద్యోగ వర్గాల డిమాండ్
పెందుర్తి: పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) విధుల కేటాయింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. రెగ్యులర్ ఆర్ఐ ప్రభుత్వ అధికారిక విధుల నిమిత్తం సమ్మిట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్‌కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మార్పులు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతితోనే జరిగాయా? లేక కార్యాలయ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఆర్ఐ సమ్మిట్ డ్యూటీ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇదే సమయంలో డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ విధుల కేటాయింపులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఐ స్థానంలో సీనియర్ అసిస్టెంట్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సమాచారం. విధులు ముగించుకుని తిరిగి వచ్చిన ఆర్ఐకి తన స్థానంలో మరో ఉద్యోగి బాధ్యతలు నిర్వహిస్తుండటం, తన విధుల్లో మార్పులు జరగడం ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలిసింది. ఈ మార్పులపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్ఐ వంటి కీలక బాధ్యతలను మరో క్యాడర్‌కు చెందిన ఉద్యోగికి అప్పగించే విషయంలో నిబంధనలు, అధికార పరిధి పాటించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి అవసరమా? ఈ నియామకానికి అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? ఉంటే ఎవరు జారీ చేశారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రెగ్యులర్ ఆర్ఐ ఆర్ఐ కోర్సు పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో విధుల మార్పు ఆయన సర్వీసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా చర్చకు వస్తోంది.
మరోవైపు కార్యాలయంలో కొందరు ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ విధుల కేటాయింపులు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ తహసీల్దార్‌కు అనుకూలంగా వ్యవహరించే సిబ్బందికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ సిబ్బంది విధులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులకు సంబంధించి వివాదాలు తలెత్తినట్లు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై బాధిత ఆర్ఐ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన పరిష్కారం లభించలేదని సమాచారం. దీంతో తహసీల్దార్ పాత్రపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలో విధుల కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నది ఎవరు? తహసీల్దార్ ఆమోదం ఉందా? జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీవో అనుమతి పొందారా? అన్నది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో తక్షణమే స్పందించాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. విధుల మార్పులకు సంబంధించిన ఉత్తర్వులు, అనుమతులు, సర్వీసు నిబంధనలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతు

