Home సినిమా వాట్ ఏ కాంబో: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.? – Andhra Waves

వాట్ ఏ కాంబో: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా నటిస్తున్న ‘మెగావర్స్‌’ టాక్‌ షోపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ షోలో పాల్గొంటున్నారనే వార్తలు వస్తుండగా.. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కలిసి చిరంజీవి షోలో సందడి చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా రూపొందించిన ఈ షోకు చిరంజీవి హోస్ట్‌గా ఉన్నారు. తెలుగు సినిమా ప్రముఖులతో ఆయన చేసే సంభాషణలు, వారి సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పటికే ఈ షో షూటింగ్ జరుగుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పుడు ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగా కలిసి ఒకే ఎపిసోడ్‌లో పాల్గొనబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ ‘స్పిరిట్’ సినిమా కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో జరిగే సంభాషణలో సినిమా విశేషాలు, ప్రభాస్‌ సినీ ప్రయాణం, సందీప్‌కు మెగాస్టార్‌పై ఉన్న అభిమానం వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

గతంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేసిన ‘అన్‌స్టాపబుల్‌’ షోలో ప్రభాస్‌ పాల్గొన్న ఎపిసోడ్‌ ఎంతటి క్రేజ్‌ సంపాదించిందో. ఆ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ సమయంలో ఆహా ప్లాట్‌ఫామ్‌ సర్వర్స్ క్రాష్ అయ్యాయనే వార్తలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు చిరంజీవి, ప్రభాస్‌, సందీప్‌ వంగా ఒకే వేదికపై అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మూడు తరాల ప్రేక్షకుల్లో అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి.. పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌లో ఉన్న ప్రభాస్‌.. తనదైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా.. ఈ ముగ్గురి కలయిక నిజమైతే ‘మెగావర్స్‌’కు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారడం ఖాయం. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు షూట్ చేస్తారు? ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుంది? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

[Megaverse, Chiranjeevi, Prabhas, Sandeep Reddy Vanga, Spirit Movie]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird