స్మార్ట్‌ఫోన్‌లో తన గెలాక్సీ ఏ సిరీస్‌ను విస్తరిస్తున్న శాంసంగ్ మరో కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ A18 4G ఈ మొబైల్‌ను సింగపూర్ పేరుతో విడుదల చేసింది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో G99+ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర 328 సింగపూర్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.24 వేల నుంచి రూ.24,500 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ మోడల్ సింగపూర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
90Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమోలెడ్ డిస్ప్లే
గెలాక్సీ A18 4Gలో 6.7 ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 2,340 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్‌పై కంటెంట్ స్క్రోల్ చేసేటప్పుడు మరింత స్మూత్‌గా కనిపిస్తుంది. సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో Infinity-U నాచ్ డిజైన్ ఇచ్చారు. డిస్ప్లేకు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అందించారు. ఫోన్ వెనుక భాగంలో గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ కవర్ ఉపయోగించారు.
మీడియాటెక్ ప్రాసెసర్.. 4GB ర్యామ్
ఈ ఫోన్ సింగపూర్ వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో G99+ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 6nm తయారీ విధానంతో రూపొందించబడింది. ఇందులో 4GB LPDDR5 ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌లో 4G కనెక్టివిటీ మాత్రమే ఉంది. యూరప్‌లో విడుదలైన గెలాక్సీ A18 4G వేరియంట్‌లో Exynos 1610 ప్రాసెసర్ ఉండగా, సింగపూర్ మోడల్‌లో మీడియాటెక్ చిప్‌సెట్ ఇచ్చారు. అంటే మార్కెట్‌ను బట్టి ప్రాసెసర్ మారుతుందని గమనించాలి.
50MP ట్రిపుల్ కెమెరా.. 25W ఫాస్ట్ ఛార్జింగ్
ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో మూడు కెమెరాలు ఇచ్చారు. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా అందించారు. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే బాక్సులో ఛార్జర్ ఉంటుందా లేదా అనేది మార్కెట్‌ను బట్టి మారవచ్చు. ఫోన్ బరువు 196 గ్రాములు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చిమ్ముళ్ల నుంచి రక్షణ కల్పించారు.
ధర ఎంతంటే?
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో పనిచేస్తుంది. సర్కిల్ టు సెర్చ్ , ఫైండ్ ద లుక్ వంటి ఏఐ ఫీచర్లతో పాటు గూగుల్ జెమిని, పెర్ ప్లక్సిటీ సేవలకు కూడా సపోర్ట్ ఉంది. శాంసంగ్ గరిష్ఠంగా 6 జనరేషన్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని ప్రకటించింది. సింగపూర్‌లో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 328 SGD. లైట్ బ్లూ, బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. డిసెంబర్ 8 వరకు ఎంపిక చేసిన స్టోర్లలో 30 SGD తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
