వరుస తుఫానులతో ఇప్పటికే అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి నవంబర్ 16 నాటికి ఉండదని తుఫానుగా మారే అవకాశం భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఏపీ తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 14 నాటికి మరింత బలపడే అవకాశం ఉంది. నవంబర్ 15 ఉదయానికి వాయుగుండంగా మారి.. నవంబర్ 16 సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ తుఫానుకు ఇరాన్ సూచించిన ‘అక్వాన్’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలో సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా మారనున్నాయి. నవంబర్ 15 నుంచి 17 వరకు నైరుతి బంగాళాఖాతంలో గంటకు 55 వేగంతో వెళ్లే అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఈ వేగం 65 వరకు చేరుకోవడానికి వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య బంగాళాఖాతంలోనూ నవంబర్ 16, 17 తేదీల్లో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి.
కొత్తగా ఏర్పడుతున్న తుఫాను ప్రభావంతో నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను ఉండే మార్గం, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదు. తుఫాను ఈశాన్య దిశగా మళ్లితే బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్నాబ్, మురసు తుఫానుల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త తుఫాను ఏపీ తీరాన్ని తాకుతుందా? లేక దిశ మార్చుకుని ఇతర ప్రాంతాల వైపు వెళ్తుందా? అనేది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రజలు వాతావరణ శాఖ తాజా సూచనలను గమనించి అప్రమత్తంగా ఉండాలి.
మరిన్ని తాజా అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
