Home సినిమా టాలీవుడ్‌లో మరో విషాదం: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.! – Andhra Waves

టాలీవుడ్‌లో మరో విషాదం: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు గిరిబాబు మరణ వార్త మరువక ముందే మరో విషాద వార్త వచ్చింది.

ప్రముఖ సంగీత దర్శకుడు పి. విజయశేఖర్‌ (72) కన్నుమూశారు. నెల్లూరులో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి మరణించారు.

దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘భారత్‌ బంద్‌’ చిత్రానికి సంగీతం అందించడం ద్వారా విజయశేఖర్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా 2010లో విడుదలైన ‘ఆకారం’ చిత్రానికి సంగీతం అందించారు.

సినిమాలతో పాటు నాటక రంగంలోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. పలు నాటకాలకు సంగీతం సమకూర్చడంతో పాటు భక్తి గీతాల ద్వారా కూడా శ్రోతలను ఆకట్టుకున్నారు.

విజయశేఖర్‌ మృతికి పలువురు సినీ, సంగీత రంగ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird