క్రికెట్ అంటే ఇష్టపడే వారికి మంచి తమిళ టైనర్గా నిలిచిన సినిమా ఇది. హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా క్రికెట్ మైదానంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే పోటీని కుటుంబ సభ్యులు, ప్రేమ, భావోద్వేగాలతో ముడిపెట్టి దర్శకుడు ఆసక్తికరంగా ప్రదర్శించారు.
ఈ సినిమా కథేంటంటే..ఈ సినిమా గ్రామీణ కథ నేపథ్యంలో సాగుతుంది. గెతు (అట్టకత్తి దినేష్) అనే వ్యక్తికి క్రికెట్ అంటే ప్రాణం. తన ఆటతో స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే అదే సొంతమైన అంబు (హరీష్ కళ్యాణ్) క్రికెట్లో మంచి ప్రతిభ కలిగి ఉంటాడు.
వీరిద్దరి మధ్య క్రికెట్ మైదానంలో మొదలైన పోటీ క్రమంగా వ్యక్తిగత విభేదాలకు. ఇదిలా ఉంటే అంబు.. గేతు కుమార్తె దుర్గను ప్రేమిస్తాడు. వీరిద్దరి మధ్య గొడవలు మరింత పెరుగుతాయి.ఒకవైపు క్రికెట్ పోటీ.. మరోవైపు ప్రేమ, కుటుంబ సంబంధాలు.. ఇలా కథ ఆసక్తికరంగా సాగుతుంది. చివరకు ఈ మధ్య గొడవలు ఎలా ముగిశాయి? అంబు ప్రేమకు గేతు అంగీకరించాడా? అనేది సినిమాలో చూడాలి.
ఈ సినిమా మరేదో కాదు లబ్బర్ పండు.. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా ఎవరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి..
మరిన్ని ఓటిటి అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
