Home సినిమా గిరిబాబు మరణంపై చిరంజీవి ట్వీట్: టోటల్ 600 చిత్రాల్లో! – Andhra Waves

గిరిబాబు మరణంపై చిరంజీవి ట్వీట్: టోటల్ 600 చిత్రాల్లో! – Andhra Waves

by andhra andhrawave
0 comments
గిరిబాబు మరణంపై చిరంజీవి ట్వీట్: టోటల్ 600 చిత్రాల్లో!


దిగ్గజ నటుడు,నిర్మాత, దర్శకుడు గిరిబాబుగారు ఈ రోజు సాయంత్రం మరణించారు. దీంతో అభిమానులు, పరిశ్రమ షాక్ కి గురైంది. ఈ నేపథ్యంలో గిరి బాబు మరణంపై చిరంజీవి స్పందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.

చిరంజీవి తన ట్వీట్ లో గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకి గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం.

ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: ప్యారడైజ్ లో ఎన్టీఆర్, చరణ్,అల్లు అర్జున్ చేసి ఉంటే: జరిగేది అదే..స్టార్ నటుడి వ్యాఖ్యలు వైరల్!

చిరంజీవి, గిరిబాబు కలిసి పలు చిత్రాలలో నటించి మెప్పించారు. వాటిలో ఒకటి అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు ఒకటి. గిరిబాబు గారు తన నట జీవితంలో సుమారు 600 కి పైగా చిత్రాలలో చేశారు. ఆయన వారసుడిగా రఘుబాబు తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చవచ్చు:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్: ఫ్యాన్స్ సంబరాలు!
మీకు నచ్చవచ్చు:అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం!

[Chiranjeevi, Giribabu, Tollywood news, Giribabu death]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird