Home సినిమా తమిళ సినీ పరిశ్రమకి సీఎం విజయ్ గుడ్‌న్యూస్: ఎంతైనా సినీ బిడ్డ కదా! – Andhra Waves

తమిళ సినీ పరిశ్రమకి సీఎం విజయ్ గుడ్‌న్యూస్: ఎంతైనా సినీ బిడ్డ కదా! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సినీ, కళా ఫుల్ అనేది పంచభూతాల పవర్ అంటూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా సింగిల్ టైంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించాడు ఇళయ దళపతి విజయ్. మరి తనకి అంతటి శక్తి ఇచ్చిన సినిమాకి సాయం చేయడంలో ఏమైనా వెనుకంజ వేస్తాడా చెప్పండి. సినిమాకి సరికొత్త శక్తిని ఇచ్చాడు.

తమిళ చిత్ర పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు, అభిమానులకి సినిమా చూసిన అనుభూతిని మరింత చేరువ చేసేందుకు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శన సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఏకంగా 6 షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. ఇంకా, అభిమానుల కోసం ఉదయం పూట ఉత్సాహాన్ని నింపేలా ప్రత్యేకంగా 6 AM ఎర్లీ మార్నింగ్ స్క్రీనింగ్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు, స్టార్ హీరోల అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, థియేటర్ యాజమానుల సంఘాలు, నిర్మాతలు గత కొంతకాలంగా కోరుతున్న మరో ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం భిన్నమైన వైఖరిని ప్రదర్శించింది. విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, నిర్వహణ భారాలను దృష్టిలో ఉంచుకుని సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలని థియేటర్ యజమానులు గట్టిగా పేర్కొన్నారు. కానీ, సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విజయ్ ఈ టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. రోజువారీ షోల సంఖ్యను 6కి పెంచడం ద్వారా నిర్మాతలు, థియేటర్ల యజమానులు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది, అదే సమయంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా సినిమా మంచి కోసమే.

ఇది కూడా చదవండి: డ్రాగన్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్: ఫ్యాన్స్ లో హుషారు!

ఈ తాజా నిబంధనల అమలుతో కోలీవుడ్‌లో పెద్ద సినిమా విడుదలైన సమయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయని విశ్లేషకులు. సాధారణ రోజుల్లోనూ, పండుగ సీజన్లలో కూడా 6 షోల ప్రదర్శన వల్ల కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 AM షోల వల్ల మొదటి రోజు కలెక్షన్ల రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ టికెట్ ధరలు పెరగకపోవడం వల్ల కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి సంకోచం లేకుండా థియేటర్లకు వచ్చేందుకు వెసులుబాటు కలిగింది. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీ మనుగడను కాపాడుతూనే, ప్రేక్షకులను దెబ్బతీయకుండా సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

[Cm Vijay Approves Six Shows Per Day, CM Vijay, Tamil Nadu cinema news, 6 shows per day, Kollywood movie updates, 6 AM screenings, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird