Home సినిమా ఇట్లు అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే! – Andhra Waves

ఇట్లు అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


టాలీవుడ్ హీరోల్లో నేను ఉన్నాను అంటూ నిన్న సెల్యులాయిడ్ పై ఇట్లు అర్జున తో అడుగుపెట్టాడు అనీష్. డెబ్యూ మూవీ అయినా కూడా మాటలు రాని(మూగ) క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసాడనే కితాబు తెచ్చుకున్నాడు. క్రేజీ బ్యూటీ అనశ్వర రాజన్ అండగా ఉండటంతో సినీ మార్కెట్ లో ఇట్లు అర్జున సౌండ్ బాగా వినిపిస్తోంది.

బాక్సాఫీస్ ట్రాకింగ్ నివేదికల ప్రకారం ఇట్లు అర్జున తొలిరోజు వరల్డ్ వైడ్ గా మియర్స్ తో కలుపుకొని 1.85 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది .విడుదల రోజున మొత్తం 877 షోలు ప్రదర్శించబడగా, సగటున 27 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఒక్కో షోకు సగటున11,973 వసూళ్లు రావడం విశేషం. తొలిరోజున దాదాపు 99,721 మంది ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చి ఈ సినిమాను వీక్షించారు.

విడుదలకు ముందు ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసిన 39 లిమిటెడ్ ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 7,000 టికెట్లు అమ్ముడై ₹15 లక్షల గ్రాస్ వసూలైంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రిలీజ్‌కు ముందు ₹78.41 లక్షల గ్రాస్ (61,203 టిక్కెట్లు) రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున మూవీ రివ్యూ!

ప్రాంతాల వారీగా వసూళ్లను గమనిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే అత్యధిక వాటా లభించింది. మొత్తం1.23 కోట్ల గ్రాస్ కలెక్షన్లలో ఏపీ, తెలంగాణల నుంచే 1.15 కోట్లు (దాదాపు 93.5 శాతం) వసూలయ్యాయి. కర్ణాటకలో 5 లక్షలు, తమిళనాడులో 2 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లో 1 లక్ష చొప్పున గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి.

నగరాల వారిగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 176 షోలు ప్రదర్శించబడగా, 38.3 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. విశాఖపట్నంలో 46 షోలకు గాను 32.3 శాతం, విజయవాడలో 50 షోలకు 18.3 శాతం, బెంగళూరులో 37 షోలకు 22.5 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

రోజు గడిచేకొద్దీ ప్రేక్షకుల ఆదరణ మరింత పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం షోలకు 29 శాతం వరకు ఆక్యుపెన్సీడం మూవీకి కలిసొచ్చింది. అటు అమెరికా (USA) ప్రీ-సేల్స్‌లోనూ ఈ చిత్రం 25 వేల డాలర్లను రాబట్టి తన సత్తా చాటింది. మొదటి రోజు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు (శనివారం) అడ్వాన్స్ బుకింగ్స్ కూడా 73.20 లక్షల మార్కును దాటాయి. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:మాయలేడి మూవీ రివ్యూ!
మీకు నచ్చవచ్చు:మేక మూవీ రివ్యూ!

[Itllu Arjuna, Aneesh, Anaswara Raajan, Venky Kudumala, Tollywood]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird