
యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడ ప్రకటన భారీ నష్టాలు వచ్చాయంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకు రూ.100 కోట్లకు పైగా నష్టం వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా దిల్ రాజు స్పందించారు. తనకు టాక్సిక్ సినిమాతో ఎలాంటి నష్టాలు రాలేదని, ఈ వార్తలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన పెయిడ్ ప్రమోషన్స్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. రామాయణ విజయంతో మళ్లీ ఫామ్లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. దీనికి దిల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా రాజు మారింది.
ఆయన మాట్లాడుతూ.. “సక్సెస్ వస్తేనే ఎనర్జీ వస్తుంది, డబ్బు వస్తుంది. కానీ గతంలో నేను ‘టాక్సిక్’ సినిమా చేస్తే, నాకేదో మొత్తం నష్టం జరిగిపోయిందని పెద్ద ఎత్తున పెయిడ్ ప్రమోషన్స్ చేశారు. మీ అందరికీ తెలియదా ఏంటి? తెలియనట్టు అమాయకమైన ప్రశ్నలు వేయొద్దు. ఇప్పుడు ఇండస్ట్రీ కల్చర్ అలా తయారైంది” అంటూ ఘాటుగా స్పందించారు.

అంతేకాదు.. టాక్సిక్ సినిమా విషయంలో తనకు నష్టమే రాలేదని స్పష్టం చేశారు. ‘రామాయణ’ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మంచి లాభాలు వచ్చాయని, టాక్సిక్ సినిమాతో కూడా నష్టం కాకుండా ఎంతోకొంత లాభమే వచ్చిందని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు తనకు రావాల్సిన పర్సంటేజ్ ఆ సినిమా ద్వారా కూడా వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కొత్త మూవీ.. సంచలన ప్రకటన చేసిన దిల్ రాజు.!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టాక్సిక్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సుమారు రూ.120 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్లు, డీల్ విలువను బట్టి దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవంటూ వార్తలు వచ్చాయి. కొందరైతే ఏకంగా రూ.100 కోట్ల నష్టం అంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు దిల్ రాజు వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి చెక్ పడింది.
మీకు నచ్చవచ్చు:
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.?
త్రివిక్రమ్, చినబాబు మధ్య విభేదాలు.. ‘గాడ్ ఆఫ్ వార్’ ఆగిపోయిందన్న వార్తలకు చెక్.!
[Dil Raju, Toxic Losses, Ramayana Movie, Yash, Tollywood]
