Home సినిమా Tollywood Celebrities: ప్రేమ పెళ్లిళ్లు.. ఆ తర్వాత విడాకులు.. – Andhra Waves

Tollywood Celebrities: ప్రేమ పెళ్లిళ్లు.. ఆ తర్వాత విడాకులు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


టాలీవుడ్ ప్రముఖులు:సినిమా ప్రపంచంలో ప్రేమలు ఈజీగానే పుడతాయి. అందులో కొన్ని మాత్రమే వివాహాల వరకు వెళ్తాయి. ప్రేమలు ఎంత వేగంగా అయితే వార్తల్లో నిలుస్తాయో.. పెళ్లి కూడా అంతే వేగంగా జరిగిపోతాయి. ఆ తర్వాత కొంతకాలానికి విడాకులు కూడా అదే స్థాయిలో సంచలనంగా మారుతుంటాయి. తెరమీద తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకునే జంటలు.. రియల్ లైఫ్‌లో ఒకటైనారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఆ బంధం ఎక్కువ కాలం ఉండదు. మనస్పర్ధలు వచ్చేస్తుంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలు.. ఇతర కారణాలు.. మొత్తానికి విడిపోవాల్సి వస్తుంది.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం.. సినీ నటుడు పవన్ కళ్యాణ్.. ఆయన భార్య అన్నా లెజ్ నోవా విడిపోయారు. దీనికి సంబంధించి సంయుక్త ప్రకటన చేశారు. ఈ వ్యవహారం చర్చకు దారితీస్తోంది. దాదాపు 13 ఏళ్ల వైవాహిక ప్రయాణానికి వారిద్దరు ముగింపు పలకడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీరిద్దరూ విడిపోవడం వెనుక ఉన్న కారణాలు ఇంతవరకూ బయటకి తెలియలేదు. అయితే టాలీవుడ్ లో ఇలాంటి పరిణామాలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. అభిమానులకు ఆదర్శ జంటలుగా కనిపించిన చాలా సెలబ్రిటీలు కూడా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించలేకపోయాయి.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్

టాలీవుడ్ లో ఎక్కువగా చర్చకు వచ్చిన సెలబ్రిటీ విడాకుల వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ బంధం ఒకటి. బద్రి సినిమా టైమ్ లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత తర్వాత సహజీవనం చేశారు. 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అకిరా నందన్.. ఆద్య అనే పిల్లలు ఉన్నారు. వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2012లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్న లెజ్ నోవాను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెతో కూడా విడిపోయారు.

నాగచైతన్య సమంత

టాలీవుడ్ లో అభిమానులను ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేసిన విడాకుల వ్యవహారంలో నాగచైతన్య, సమంత జంట ఒకటి. ఏం మాయ చేసావే సినిమాతో వీరిద్దరూ తెరమీద సంచలనం సృష్టించారు. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల ప్రేమ ప్రయాణం తర్వాత 2017 లో గోవాలో అత్యంత ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మజిలీ సినిమాలో భార్యాభర్తలు గా నటించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. రియల్ లైఫ్ లో కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను నిర్ణయించారు. ఆ తర్వాత వారిద్దరూ తమ కెరియర్లలో ముందుకు సాగుతున్నారు. నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకుంటే.. సమంత రాజ్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి.

మంచు మనోజ్, ప్రణతి రెడ్డి

మంచు కుటుంబం నుంచి వచ్చిన హీరో మంచు మనోజ్. ఈయన తన వైవాహిక జీవితంలో విడాకులు తీసుకున్నారు. 2015లో ప్రణతి రెడ్డిని ఈయన పెళ్లి చేసుకున్నారు. చివరికి తర్వాత ఇద్దరు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి చివరికి 2019లో విడాకులు తీసుకున్నట్టు మనోజ్ స్వయంగా చెప్పారు. తమ మధ్య విభేదాలు.. అనేక రకాల వేదనాభరితమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. అన్ని ఆలోచించిన తర్వాత విడివిడిగా నిర్ణయించుకున్నామని అప్పట్లో మనోజ్ వివరించారు. ఆ తర్వాత ఆయన భూమా మౌనిక రెడ్డిని రెండవ పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యకు ఇప్పటికే వివాహం జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆమె కూడా భర్తతో విడాకులు తీసుకుంది. మౌనిక ద్వారా మనోజ్ ఒక బిడ్డను కన్నారు. తన రెండవ భార్య మొదటి భర్త ద్వారా కలిగిన కుమారుడిని కూడా సొంత కుమారుడిగా స్వీకరించారు.

పవన్ కళ్యాణ్ నందిని

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో రేణు దేశాయ్ కంటే, అన్నా లెజ్ నోవా కంటే ముందుగా ఒక వైవాహిక బంధం ఉంది. 1997లో నందిని అనే అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అదే ఆ బంధం ఎక్కువ కాలం ఉండలేదు. 2008లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తో వివాహం.. అనంతరం అన్నతో వివాహం జరిగింది.. మొత్తంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో మూడు వైవాహిక బంధాలు ఎక్కువ కాలం నిలవలేదు.

వీరు మాత్రమే కాకుండా పవన్ రెండవ సోదరుడు కొణిదెల నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమె ఇప్పుడు నిర్మాతగా రాణిస్తున్నారు. ఫింక్ ఎలిఫెంట్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, సినిమాలు మార్చారు. కమిటీ కుర్రోళ్లు అనే సినిమా ద్వారా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు.

సినిమా ఇండస్ట్రీలో తారల వ్యక్తిగత జీవితంపై అభిమానులకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. మీడియా కూడా వారి వార్తలను విపరీతంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అందువల్లే వారి ప్రేమలు.. పెళ్లిళ్లు.. విడాకులు వంటి వ్యవహారాలు నిత్యం నిలుస్తాయి. అయితే ఒక జంట విడిపోవడానికి వెనుక ఉన్న కారణాలేంటి.. ఏం జరిగింది అనే విషయాలు స్వయంగా వారు చెప్తే తప్ప బయటకి తెలియదు. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి వాటికి మసాలా దట్టించి ప్రసారం చేస్తున్నాయి. మన సమాజంలో నిజాలు కంటే ఊహాగానాలకే విలువ ఎక్కువ కాబట్టి.. జనాలు కూడా వీటిని నమ్ముతుంటారు. అయితే సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న తర్వాత కొందరు తమ కెరియర్ల మీద దృష్టి పెట్టారు. మరికొందరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఇంకొందరు పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏదిఏమైనప్పటికీ.. తెరమీద కనిపించే సెలబ్రెటీల జీవితాలు.. రియల్ లైఫ్ లు వేరే విధంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో వారి వ్యక్తిగత గోప్యతకు.. వ్యక్తిగత నిర్ణయాలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అభిమానుల మీద ఉంటుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird