Home క్రైమ్ అక్కు యాదవ్: అత్యాచారాలు.. హత్యలు.. పోలీసుల నిర్లక్ష్యం.. – Andhra Waves

అక్కు యాదవ్: అత్యాచారాలు.. హత్యలు.. పోలీసుల నిర్లక్ష్యం.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Akku Yadav: అది మహారాష్ట్రలోని నాగ్ పూర్. 2004 ఆగస్టు 13.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తిని కోర్టు విచారణ కోసం తీసుకొచ్చారు. గతంలో ఎన్నో అత్యాచారాలు.. హత్యకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. అతని పేరు చెప్తేనే ఒక ప్రాంతంలోని మహిళలు ఇబ్బంది పడేవారు. అయితే ఆరోజు కోర్టు గదిలోకి వచ్చిన మహిళలు మాత్రం భయపడలేదు. కూరగాయలు కోసే కత్తులు.. కారంపొడితో అతడి మీద యుద్ధం చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే అతడు […]

అక్కు యాదవ్: అది మహారాష్ట్రలోని నాగ్ పూర్. 2004 ఆగస్టు 13.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తిని కోర్టు విచారణ కోసం తీసుకొచ్చారు. గతంలో ఎన్నో అత్యాచారాలు.. హత్యకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. అతని పేరు చెప్తేనే ఒక ప్రాంతంలోని మహిళలు ఇబ్బంది పడేవారు. అయితే ఆరోజు కోర్టు గదిలోకి వచ్చిన మహిళలు మాత్రం భయపడలేదు. కూరగాయలు కోసే కత్తులు.. కారంపొడితో అతడి మీద యుద్ధం చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అత్యంత సంచలనం ఏంటంటే.. ఆహత్యకు బాధ్యులు ఎవరని పోలీసులు ప్రశ్నించగా.. అక్కడ మహిళలు మేమే బాధ్యులం అని చెప్పారు. అలా చనిపోయిన వ్యక్తి పేరు అక్కు యాదవ్.

మహారాష్ట్రలోని నాగపూర్ కస్తూర్బా నగర్ నుంచి పుట్టిన భరత్ కాళీ చరణ్లియాస్ అక్కు యాదవ్ 1990 ల ఆ ప్రాంతంలో ఒక ముఠాను నడిపించేవాడు. బెదిరింపులు.. దౌర్జన్యాలు.. హింసకు పాల్పడేవాడు. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసేవాడు. ముఖ్యంగా మహిళలు.. బాలికలు అతడు చేసే దారుణాల వల్ల నరకం చూసేవారు. అతడు 40 మందికి పైగా మహిళలు.. ఇంకా కొంతమంది పిల్లల మీద దారుణాలకు పాల్పడ్డాడు. కనీసం మూడు హత్యలలో అతడి ప్రమేయం ఉందని అభియోగాలు వినిపించాయి. అతడి చేతిలో దారుణానికి గురైన బాధితుల్లో పదేళ్ల బాలిక కూడా ఉన్నప్పుడు ఆరోపణ వినిపించింది. అక్కు యాదవ్ అనేకసార్లు పోలీసులకు పట్టుబడినప్పటికీ.. తిరిగి బయటికి వచ్చేవాడు.

అతడిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కొందరు అతడితో సంబంధాలు ఉన్నాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి మహిళలకు రక్షణ లభించేది కాదు. దీంతో కస్తూర్బా నగర్ మహిళల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది.

2004 ఆగస్టులో ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. హోటల్ మేనేజ్‌మెంట్ డిప్లమా చేసిన ఉషా నారాయణే అనే యువతీ అక్కు యాదవ్ ముఠా ముఠా చేసే ఆగడాలపై స్థానిక మహిళలకు అండగా నిలిచారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేస్తే ప్రోత్సహించారు. దీంతో అక్కు యాదవ్.. అతడి అనుచరులు ఉషా ఇంటిని చుట్టుముట్టారు. ఆమె ఇంటి తలుపు మూసుకొని లోపలే ఉండిపోయారు. గ్యాస్ సిలిండర్ పేల్చేస్తానని హెచ్చరించడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటనతో స్థానిక మహిళల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఆగస్టు 6న అక్కడి మహిళలు అక్కు యాదవ్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కు యాదవ్ బెయిల్ మీద బయటకు వస్తే మళ్లీ తమ మీద దాడులు చేస్తాడని మహిళలు భయపడ్డారు. దీంతో ఆగస్టు 13న అతడిని కోర్టుకు తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న కస్తూర్బా నగర్ మహిళలు భారీగా అక్కడికి చేరుకున్నారు.

అక్కు యాదవ్ బెయిల్ విచారణ సమయంలో మహిళలు ఒక్కసారిగా అతని మీద దాడి చేశారు. వారి చేతిలో కూరగాయల కత్తులు.. కారంపొడి ఉన్నాయి. కోర్టు గదిలోనే అతని మీద దాడి జరిగింది. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ దాడిలో అక్కు యాదవ్ చనిపోయాడు. ఈ ఘటనలో చర్చకు దారి తీసింది. పోలీసులు అయిదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. అయితే స్థానికంగా నిరసనలు వ్యక్తం కావడంతో వారిని విడుదల చేశారు. ఆ తర్వాత మొత్తం 21 మంది పై కేసు నమోదు అయింది. వీరిలో ఉషా కూడా ఉన్నారు. పోలీసులు.. న్యాయవ్యవస్థ వారికి రక్షణ కల్పించడంలో విఫలమైందని.. అందువల్లే మహిళలు ఈ స్థాయిలో దాడికి దిగారని.. నాటి విశ్రాత హైకోర్టు న్యాయమూర్తి భావు వాహనం బహిరంగంగానే. ఇక ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం సాగింది. 2014 నవంబర్ 10న నాగ్ పూర్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విచారణ సాగుతున్న సమయంలో ముగ్గురు నిందితులు మరణించారు. మిగిలిన 18 మంది మీద సాక్షాలు లేవని నిజమైంది.. కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అక్కు యాదవ్ హత్య కేసులో ఎవరికి శిక్ష పడలేదు.

అక్కు యాదవ్ ఘటన ఇప్పటికి దేశంలో చర్చకు దారితీస్తూనే ఉంటుంది. మహిళలకు న్యాయం అందని పరిస్థితుల్లో.. వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ప్రాంగణంలోనే జరిగిన ఈ హత్య మూక న్యాయానికి ఉదాహరణ అని మరికొందరు వ్యాఖ్యానిస్తారు. ఈ ఘటన ఆధారంగా 2021లో 200 హల్లా హో అనే సినిమా రూపొందించబడింది. 2022లో నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఇండియన్ ప్రిడేటర్ మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్ డాక్యుమెంటరీ సిరీస్ కూడా ఈ ఘటనను ప్రధానంగా చూపించింది నీకో క్రిస్టాఫ్.. షరీల్ ఉడెన్ రాసిన ఆఫ్ ది స్కై పుస్తకంలోనూ ఈ ఉదంతం ప్రస్తావన వచ్చింది.

ఈ ఘటనలో కీలకంగా ఉన్న ఉష తన జీవితాన్ని మరో విధంగా మలచుకున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో కొనసాగకుండా.. కస్తూర్బా నగర్‌లోని మహిళలు.. స్థానికులకు ఉపాధి నైపుణ్యాలు నేర్పించే సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. క్యాటరింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు, దుస్తుల తయారీ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు భయంతో బతికిన మహిళలు తమ గొంతు వినిపించిన ఘటనగా అక్కూ యాదవ్ ఉదంతం చరిత్రలో నిలిచిపోయింది. ఇదే సమయంలో బాధితులకు సకాలంలో న్యాయం.. రక్షణ అందించడంలో వ్యవస్థ విఫలమైతే.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో.. ఈ ఘటన నిరూపిస్తోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird