Home సినిమా డైమండ్ తెలుగు సినిమాలని లైట్ తీసుకుంటున్నారు: మలయాళ సినిమాల్లో ఏముంది! – Andhra Waves

డైమండ్ తెలుగు సినిమాలని లైట్ తీసుకుంటున్నారు: మలయాళ సినిమాల్లో ఏముంది! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


తెలుగు సినిమా… ఎంత గొప్పదో, ఎన్ని ఆణిముత్యాలాంటి సినిమాలని అందించి మనిషి ఆలోచనల స్థాయిని మెరుగుపరిచిందో, ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సుదీర్ఘ కాలం నుంచి తన పని తాను చేసుకుంటూ పోయే సినిమా ఈ మధ్య కాలంలో కొంత మంది ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం వస్తుంది. దోషి విషయంలో అసలు లోపం ఎక్కడుందో అనేది అంతుచిక్కని రహస్యం.

ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ‘సమ్మర్ హాలిడేస్’ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ తాజాగా సక్సెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ’ నేనుఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసిన ఒక అద్భుతమైన కొటేషన్‌ చూశాను. ‘In search of Gold, we lost Diamonds’ అంటే బంగారం కోసం వెతికే మనం విలువైన డైమండ్స్‌ను వదిలేస్తున్నాము అంటే నానుడి ప్రస్తుతం మన తెలుగు ప్రేక్షకుల విషయంలో అచ్చం సరిపోతుంది. ప్రస్తుతం ప్రేక్షకులు తమిళ, మలయాళ భాషల నుంచి డబ్ అయ్యి వచ్చే సినిమాలని ఎంతో ఇష్టపడి బంగారంలా ఆదరిస్తున్నారు. కానీ మన తెలుగు పరిశ్రమలో వస్తున్న ‘సమ్మర్ హాలిడేస్’ వంటి అచ్చమైన మంచి కంటెంట్ ఉన్న డైమండ్ లాంటి సినిమా థియేటర్లలో చూసేందుకు వెనుకడుగు వేస్తున్నారని రోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

థియేటర్లకు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే ఆడియన్స్ వెళ్తున్నారని, కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులు అందరూ తమ కుటుంబాలతో కలిసి థియేటర్లకు వచ్చి ఈ సినిమాను తిలకించాలని, మౌత్ టాక్ ద్వారా ప్రచారం చేస్తే ఇలాంటి చిన్న చిత్రాలు, అద్భుతమైన కంటెంట్ ఉన్న బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించగలవని ఆయన సినిమాలు అందించాయి. ‘సమ్మర్ హాలిడేస్ లో నటించే అవకాశం తనకు ఎలా వచ్చిందనే దాని వెనుక ఉన్న ఒక సరదా జ్ఞాపకాన్ని కూడా రోహన్ అందరితో పంచుకున్నారు. దర్శకుడు శ్రీకర్ నయన్ జీ వాళ్ల అమ్మగారు ఒకరోజు ఉదయం పూట తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడారని, ఆవిడ ఎవరో మొదట్లో అర్థంకాక ఓ ఆంటీ ఎలా ఉన్నారని తాను అడిగానని రోహన్ నవ్వుతూ చెప్పారు.

‘సమ్మర్ హాలిడేస్’ సినిమాలో తనను ప్రధాన పాత్రలో తీసుకోమని శ్రీకర్‌కు ఆయన వాళ్ల అమ్మగారే స్వయంగా జాగ్రత్తగా చేశారట. అయితే అప్పుడు దర్శకుడు సూచించూ, ఆ కుర్రాడు అంతా కామెడీ చేస్తాడని, అతనికి ఎమోషనల్ సీన్స్ సరిగా పండించగలడా అనే సందేహం వ్యక్తం చేశారట. కానీ సినిమా చూశాక తన నటనతో దర్శకుడు శ్రీకర్ కచ్చితంగా సంతృప్తి చెంది ఉంటారని రోహన్ ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఇదే వేదికపై సినిమాలోని ఒక భావోద్వేగ సన్నివేశం గురించి చెబుతూ రోహన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. చిత్రంలో మదర్ సెంటిమెంట్‌కు సంబంధించిన ‘అమ్మ’ పాట వస్తున్నప్పుడు, అందులో నటి హర్షిని అద్భుతమైన నటనను చూసి తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు రోహన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: పాపం సత్య రెమ్యునరేషన్ ఇంతే: ఒక్క రోజుకి ఎంతంటే!

తన జీవితంలో తల్లి కళ్లలో కన్నీళ్లు చూడటం ఇదే మొదటిసారని, హర్షిని అబ్బింగ్‌తో కూడిన నటన తనను ఎంతగానో కదిలించిందని చెబుతూ ఆమెతో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో తనతో పాటు నటించిన కో-స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన అరుణ్ గురించి చెప్తూ.. వాడు తనను షూటింగ్‌లో ఎప్పుడూ విసిగిస్తూ ఇరిటేట్ చేస్తున్నాడని, అయినా తనకెంటే వాడు అంటే చాలా ఇష్టమని, ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని చిన్ననాటి సరదా కబుర్లను పంచుకున్నారు.

చివరిగా ఈ సినిమా కోసం అంకితభావంతో పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు రోహన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు శ్రీకర్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ సంతోష్, నిర్మాత ధీరజ్ అలాగే ప్రొడక్షన్ మేనేజర్ శివతో సహా ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని కొనియాడారు. కేవలం సోషల్ మీడియాలో రివ్యూలు, ట్వీట్లు ఇస్తే సరిపోదని, మంచి సినిమాలను బతికించాలంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి తమ ఆదరణ చాటాలని కోరిన రోహన్ రాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు ప్రేక్షకులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వైరల్‌గా మారాయి. చిన్న వయసులోనే తన మాటలతో అందరినీ ఆలోచింపజేసేలా మాట్లాడిన రోహన్, మన ప్రేక్షకులు ఇతర భాషా చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి.

మీకు నచ్చవచ్చు: సమ్మర్ హాలిడేస్ రివ్యూ
మీకు నచ్చవచ్చు: రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్ కె ఎన్ ఫైర్!

[Rohan Roy Speech Summer Holidays Success Meet, Rohan Roy About Summer Holidays, Summer Holidays movie, Telugu child actor, Rohan Roy viral speech,  Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird