వరల్డ్ స్టార్ హోల్డింగ్:సాధారణంగా దీపావళి సందర్భంగా కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బహుమతులు అందజేస్తాయి. కొన్ని కంపెనీలు అయితే ప్రతి పండుగకు ఉద్యోగులకు ఏదో ఒక రూపంలో బహుమతులు అందజేస్తూ ఉంటాయి. అయితే ఈ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. వార్తల్లో కూడా వచ్చింది. మహిళా ఉద్యోగులకు అయితే ఏక ఐఫోన్లు అందించారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. యూఏఈ లోని వరల్డ్ […]
వరల్డ్ స్టార్ హోల్డింగ్:సాధారణంగా దీపావళి సందర్భంగా కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బహుమతులు అందజేస్తాయి. కొన్ని కంపెనీలు అయితే ప్రతి పండుగకు ఉద్యోగులకు ఏదో ఒక రూపంలో బహుమతులు అందజేస్తూ ఉంటాయి. అయితే ఈ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. వార్తల్లో కూడా వచ్చింది. మహిళా ఉద్యోగులకు అయితే ఏక ఐఫోన్లు అందించారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.
యూఏఈలోని వరల్డ్ స్టార్ హోల్డింగ్ సంస్థ తన ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులను అందించింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ (కేరళకు చెందినవారు) ఉద్యోగులకు ఈ బహుమతిని అందించారు. దీనికోసం ముందుగా కాన్ఫరెన్స్ రూమ్ లోని కుర్చీలపై ఐఫోన్ బాక్స్ లను సిద్ధంగా ఉంచారు. అనంతరం మహిళా ఉద్యోగులందరినీ సమావేశ మందిరానికి రావాలని పిలిచారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉద్యోగులకు వారికి ఐఫోన్ బాక్సులు కనిపించాయి. దీంతో వారు ఒకసారి ఆశ్చర్యపోయారు. వారికి ఈ స్థాయిలో ఖరీదైన బహుమతి వస్తుందని వారు ఊహించలేదు. ఈ సందర్భంగా హౌస్ కీపింగ్ పని చేసే మహిళా ఉద్యోగులు కూడా ఐఫోన్లు అందించారు. తమను కూడా గుర్తించి ఈ బహుమతులు అందించడంతో హౌస్ కీపింగ్ సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఉద్యోగుల హోదా.. విభాగంతో సంబంధం లేకుండా బహుమతులు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత సెప్టెంబర్లో ఇదే సంస్థ ఉద్యోగులకు ఐఫోన్లను బహుమతులుగా అందించింది. తాజా వీడియోతో ఈ సంస్థ మరోసారి, అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రధాన మీడియాలో వార్తల్లో నిలిచింది.
“కంపెనీకి ఉద్యోగుల మూల స్తంభం. వారు ఎంత కష్టపడి పనిచేస్తే కంపెనీకి ఆ స్థాయిలో లాభాలు వస్తాయి. వారి కష్టాన్ని కంపెనీ కచ్చితంగా గుర్తించాలి. వారికి పండుగల సమయంలో.. ఇతర అవసరాలు వచ్చినప్పుడు కచ్చితంగా వాటిని తీర్చాలి. అప్పుడే ఉద్యోగులకు కంపెనీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థను గొప్పగా తీసుకెళ్తుంది. తమకు ఐఫోన్లను దీపావళి కానుకలుగా ఇచ్చిన యాజమాన్యానికి ఉద్యోగులు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. తమకోసం కంపెనీతీసుకున్న నిర్ణయాన్ని వారు ఆనందంగా స్వాగతిస్తున్నారు.
