Home సినిమా సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా! – Andhra Waves

సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సూపర్ స్టార్ కృష్ణ…సృష్టించిన ప్రభంజనం, సునామి, సవ్వడి గురించి చెప్పుకోవాలంటే ఎండింగ్ కి ఒక లెక్క అంటూ ఉండదు. అంతలా ఆ నటశేఖరుడు తన హవాని కొనసాగించాడు. రీసెంట్ గా నెత్తింట కృష్ణగారు అందుకున్న తొలి పారితోషకం న్యూస్ వైరల్ హోదాలో తన హవా చాటుతోంది.

1965వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘తేనె మనసులు’ చిత్రంతో కృష్ణ గారు కథానాయకుడిగా టాలీవుడ్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్లలో అనేకమంది దిగ్గజ నటులు పోటీ పడుతున్నారు, ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారి ఫోటోలు చూడగానే ఆయనలోని నటుడిని గుర్తించి హీరోగా ఎంపిక చేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటుల సినిమాలు వంద రోజులు ఆడుతున్న తరుణంలో, కొత్త నటులతో వచ్చిన ‘తేనె మనసులు’ చిత్రం ఏకంగా 100 రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న మూవీ: 25 రోజులు పూర్తి.. సక్సెస్ మీట్‌లో ఏం చెప్పారంటే!

ఇంతటి ఘన విజయం సాధించిన ఈ మొదటి చిత్రం కృష్ణ గారు అందుకున్న తొలి పారితోషికం అక్షరాల 2,000 మాత్రమే. ఆ కాలంలో 2,000 అనేది చాలా గౌరవప్రదమైన పెద్ద మొత్తమే అయినప్పటికీ, నేటితరం ఆలోచనలతో చాలా ఆసక్తికరమైన అంశం. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన మైలురాయి లాంటి గూఢచారి 116 సినిమాకు గానూ కృష్ణ గారికి 5,000 పారితోషికం లభించింది. నేటికాలంలో ఒకే ఒక్క హిట్టు రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కోట్లలోకి పెంచేస్తుంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం ‘తేనె మనసులు’ విజయం సాధించారు, దాని తర్వాత దాదాపు 30 నుండి 40 సినిమాల వరకు కేవలం 5,000 రెమ్యునరేషన్‌తోనే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగారు. డబ్బు కంటే నటనపై ఉన్న అమితమైన ప్రేమ, నిర్మాత సంక్షేమమే ముఖ్యమని నమ్మిన నిజమైన నిర్మాతల హీరో ఆయన. అందుకే అభిమానులు అంటుంటారు సాక్షాత్తు తెలుగు కళామతల్లినే కృష్ణ గారిని ఈ భూమి మీదకి పంపించి తనకి ఏలలేని గౌరవం, విలువ వచ్చేలా చూసుకుందని.

[Superstar Krishna First Remuneration, Superstar Krishna remuneration, Krishna first movie salary, Thene Manasulu movie, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird