Home సినిమా వడివేలు ఇల్లు వంద కోట్లు – Andhra Waves

వడివేలు ఇల్లు వంద కోట్లు – Andhra Waves

by andhra andhrawave
0 comments
వడివేలు ఇల్లు వంద కోట్లు


స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు వందల కోట్ల విలువైన విల్లాలను కొనుగోలు చేసినప్పుడు ‘వాళ్ల రేంజ్ అది’ అంటూ లైట్ తీసుకునే సోషల్ మీడియా.. అదే ఒక కమెడియన్ విషయంలో వచ్చేసరికి మాత్రం భూతద్దం పెట్టి మరీ ఆస్తుల లెక్కలు తీయడం మొదలుపెడుతుంది. సీనియర్ నటుడు వడివేలు కొత్త ఇల్లు కట్టుకోవడంపై నెట్టింట నడుస్తున్న చర్చ సరిగ్గా ఇలాంటి ధోరణినే బయటపెడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వడివేలు తమిళ సంప్రదాయ శైలిలో కట్టుకున్న ఇంటి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని, అందులో ఏకంగా 42 సీసీ కెమెరాలు ఉన్నాయని వార్తలు రాగానే.. “ఒక కమెడియన్‌కి అంత డబ్బెక్కడిది?”, “ఇంటికి అన్ని కెమెరాలు ఎందుకు?” అంటూ కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది, వందలాది చిత్రాలతో కోట్లాది మందిని నవ్వించిన ఒక సీనియర్ ఆర్టిస్ట్ తన సొంత డబ్బుతో కలల ఇంటిని నిర్మించుకుంటే అందులో తప్పేముంది.

వడివేలు ప్రయాణం పూలపాన్పేమీ కాదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఆయన తన కెరీర్ స్టార్టింగ్‌లో కటిక పేదరికాన్ని అనుభవించి, తన టాలెంట్‌తోనే పరిశ్రమలో స్టార్ ఇమేజ్‌ని పొందారని అంటున్నారు. ఆ తర్వాత వివాదాలు, రాజకీయాల కారణంగా దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీకి దూరమై తీవ్ర, మానసిక ఇబ్బందులు పడ్డారు. అలాంటి వ్యక్తి మళ్లీ సినిమాల్లోకి వచ్చి, కష్టపడి తన కుటుంబం కోసం ఒక విలాసవంతమైన ఇల్లు కట్టుకుంటే సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనపై అనవసరమైన కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆస్తుల గురించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నవ్వించడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. అలాంటి కళను నమ్ముకుని, అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి నిలబడిన ఒక కళాకారుడికి సొంత ఇల్లు కట్టుకునే హక్కు కూడా లేదా, హీరోల లగ్జరీని చూసి మురిసిపోయే నెటిజన్లు.. ఒక కమెడియన్ రాజభోగాన్ని చూసి ఓర్వలేక ముమ్మాటికీ వివక్షే తప్ప మరొకటి కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సోషల్ మీడియా అనేది వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోతుందనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టం అయిందని అంటున్నారు.

The post వడివేలు ఇల్లు వంద కోట్లు appeared first on iDreamPost.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird