Home Latest News అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన పారా అథ్లెట్ బలవన్మరణం: ప్రపంచంలో క్రీడా విషాదం.! | భారత పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య | పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ | ఆసియా పారా గేమ్స్ | డోపింగ్ | విషం – Andhra Waves

అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన పారా అథ్లెట్ బలవన్మరణం: ప్రపంచంలో క్రీడా విషాదం.! | భారత పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య | పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ | ఆసియా పారా గేమ్స్ | డోపింగ్ | విషం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


భారత క్రీడాకార పెను విషాదం చోటు చేసుకుంది. ఇండియా గర్వించదగ్గ పారా స్టార్ పారా అథ్లెట్, అంతర్జాతీయ వేదిక స్వర్ణ పతాకాలు దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన నీరజ్ యాదవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త దేశ వ్యాప్తంగా క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఢిల్లీలోని నీరజ్ యాదవ్ తన స్వగృహంలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. భారత పారా అథ్లెటిక్స్ టీమ్ హెడ్ కోచ్ సత్యనారాయణ ధ్రువీకరించారు. నీరజ్ యాదవ్ మృతి అత్యంత బాధాకరమని, దేశం ఒక గొప్ప అథ్లెట్‌ను కోల్పోయిందని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

గత కొంత కాలంగా నీరజ్ యాదవ్ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఆసియా పారా గేమ్స్‌కు సంబంధించి డోపింగ్ నిబంధనల కారణంగా ఆయన అర్హత కోల్పోయారు. ఈ పరిణామం ఆయనను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసింది. ఆ ఆందోళన, ఒత్తిడి తలవంచలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.

చిన్ననాటి నుంచి శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటూ నీరజ్ యాదవ్ ఈ స్థాయికి ఎదిగారు. ఏడేళ్ల ప్రాయంలోనే పోస్ట్ పోలియో రెసిడ్యువల్ పెరాలిసిస్ బారిన పడిన నీరజ్ యాదవ్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగారు. మొదట వీల్‌చైర్ టెన్నిస్‌లో సత్తా చాటిన నీరజ్ యాదవ్.. ఆ తర్వాత పారా-అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టారు. ఎఫ్ 55 కేటగిరీలో (సీటెడ్ షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో) పోటీ చేస్తూ అసాధారణ ప్రతిభ కనబరిచారు.

2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటారు. ఆ తర్వాత 2023లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ ట్రో, డిస్కస్ ట్రో విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. మొత్తంగా తన కెరీర్‌లో మూడు పారా గేమ్స్ స్వర్ణ పతకాలు సాధించిన నీరజ్ యాదవ్ ఆత్మహత్యకు సాహసించడం క్రీడాలోకాన్ని విషాదంలో ముంచేసింది.

[Indian Para Athlete Neeraj Yadav Suicide, Para Games Gold Medalist, Asian Para Games, Doping, Poision, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird