అనకాపల్లి,ఆంధ్రా వేవ్స్: జీవీఎంసీ పరిధిలోని 112వ వార్డులో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. విజయరామరాజుపేటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు భాస్కర్, కర్ణం గణేష్ జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో వీరు జనసేన పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన భాస్కర్, కర్ణం గణేష్‌లను కొణతాల రామకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
112వ వార్డులో వైఎస్సార్సీపీ నాయకులు జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


