Home Uncategorized ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన కొణతాల రామకృష్ణ

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన కొణతాల రామకృష్ణ

by andhra andhrawave
0 comments

అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచన

అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి, కశింకోట మండలాల్లో రాజకీయ సందడి నెలకొంది. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ బి-ఫారాలు అందజేశారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కొణతాల రామకృష్ణ, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

అనకాపల్లి, కశింకోట మండలాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird