Home Latest News కన్నడిగులకే ఉద్యోగాలు: కర్ణాటక సీఎం డీకే స్థానిక నినాదం.. సాఫ్ట్ వేర్ కంపెనీలకు హెచ్చరిక.! | కర్ణాటక సీఎం డీకే శివకుమార్ లోకల్ స్లోగన్ | | బెంగళూరు ఐటీ సంస్థలు | కన్నడిగుల ఉద్యోగ వివక్ష | కర్ణాటక స్థానిక ఉపాధి – Andhra Waves

కన్నడిగులకే ఉద్యోగాలు: కర్ణాటక సీఎం డీకే స్థానిక నినాదం.. సాఫ్ట్ వేర్ కంపెనీలకు హెచ్చరిక.! | కర్ణాటక సీఎం డీకే శివకుమార్ లోకల్ స్లోగన్ | | బెంగళూరు ఐటీ సంస్థలు | కన్నడిగుల ఉద్యోగ వివక్ష | కర్ణాటక స్థానిక ఉపాధి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


కర్నాటక ముఖ్యమంత్రి కర్నాటక ఫస్ట్ అంటూ స్థానిక నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్పష్టమైన హెచ్చరిక జారీ చేయబడింది. రాష్ట్రంలోని ప్రైవేట్, సాఫ్ట్ వేర్ సంస్థలు స్థానిక కన్నడిగులకు ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వకుండా, ఉద్దేశపూర్వకంగా వారికి ఉద్యోగాలు నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని డీకే హెచ్చరిక. ఇటీవల సామాజిక మాధ్యమ వేదికగా ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ నియామకాలపై వచ్చిన నేపథ్యంలో ఆయనీ హెచ్చరిక జారీ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వపరంగా కన్నడిగులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ.

బెంగళూరులోని కొన్ని ఐటీ సంస్థలు తమ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా స్థానిక కన్నడిగులను పక్కన పెడుతున్నాయని, రెజ్యూమ్‌లలో మాతృభాష కన్నడ అని కొని కంపెనీలు దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయని ఓ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన డీకే శివకుమార్, రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు స్థానికులకు అవకాశాలు నిరాకరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

కర్ణాటకలో కన్నడిగుల హక్కులు, వారి ఆత్మగౌరవం, ఉపాధి అవకాశాలకు ఎటువంటి భంగం కలగకుండా చూసే ప్రభుత్వ బాధ్యత అని ముందుగా సోషల్ మీడియా వేదికగా విస్పష్టంగా ప్రకటించారు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఉద్దేశపూర్వకంగా స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాలలో వివక్ష చూపితే ఉపేక్షించేది లేదని ప్రకటించారు. ఈ ప్రైవేట్ రంగంలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

గతంలోనూ ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపులపై చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగగా, పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల కారణంగా వాటిని పక్కన పెట్టారు. అయితే తాజా పరిణామాలు మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల కారణంగా స్థానిక యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది. ఇలా ఉండగా కన్నడిగులకు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలపై డీకే శివకుమార్ ప్రకటన పట్ల ప్రతిపక్ష పార్టీలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో స్థానికులకు ఏ రకంగా ఉద్యోగాలు కల్పిస్తారో స్పష్టం చేయాలన్న డిమాండ్ నూ తెరపైకి తెచ్చాయి.

[Karnataka CM DK Shivakumar Local Slohun, , Bengaluru IT Firms, Kannadigas Job Discrimination, Karnataka Local Employment, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird