Home సినిమా ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! – Andhra Waves

‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


ప్రమోషన్స్ లో వెంకటేష్, త్రివిక్రమ్ ల జోరు చూస్తూనే ఆదర్శ కుటుంబంతో సెల్యులాయిడ్ పై తమ జెండా, ఎజెండాని చాలా బలంగా చాటేలా ఉన్నారు. అభిమానులు, సినీ ప్రియులు, ప్రేక్షకుల్లో కూడా ఒకప్పుడు డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసిన వెంకీ,త్రివిక్రమ్ కాంబో ఈ సారి పరిపూర్ణమైన విందుని ఇవ్వడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఆదర్శ కుటుంబం రివ్యూ అందర్నీ 30 వ తారీకునే కాకుండా 29 నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించాలనే కోరిక ఉంది. మరి ఆ రివ్యూ చూసేద్దాం.

ఫస్ట్ రివ్యూస్ మరియు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రథమార్థం (ఫస్ట్ హాఫ్) అంతా వెంకీ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ సమకాలీన సంభాషణలతో సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్థం (సెకండ్ హాఫ్) లో కథ ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగి, ఊహించని సస్పెన్స్, క్రైమ్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో ఆకట్టుకుంటుంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం (BGM) సినిమాలోని భావోద్వేగాలను, యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లిందనే టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించగా, పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం అలరించబోతున్నారు. ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ ఐకానిక్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి! హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఏర్పాటు చేశాడు.

ఇది కూడా చదవండి: మనుషుల్ని తింటున్నా ఆడదెయ్యం: ఒక్కో ట్విస్ట్ తో వణికిస్తున్న హర్రర్ మూవీ: ఏ ఓటిటిలో ఉందంటే!

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో వింటేజ్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “సైన్యం చావకుండా గెలిచే యుద్ధం ఏది సార్?”, “ఒక మనిషి మృగంలా మారడం అనేది ఒక ప్రక్రియ.. ఒక పరిణామం” వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కలబోసి త్రివిక్రమ్ అద్భుతంగా మలచినట్లు టాక్.

[Aadarsha Kutumbam First Review, Aadarsha Kutumbam, Victory Venkatesh, Trivikram Srinivas, Aadarsha Kutumbam Review, AK47 Movie, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird