Home ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini: విడదల రజిని వడ్డీతో సహా ఇస్తుందట.. – Andhra Waves

Vidadala Rajini: విడదల రజిని వడ్డీతో సహా ఇస్తుందట.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Vidadala Rajini: సేమ్ డైలాగ్.. సేమ్ అదే ఎక్స్‌ప్రెషన్.. ఏ మాత్రం తేడా లేదు.. చేతులు పైకి లేపి హెచ్చరించడం.. కళ్ళు మూసుకొని మాట్లాడటం.. హావభావాలను ప్రదర్శించడం.. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. అచ్చం జగన్ నే.. ఎవరైనా సరే ఒక మనిషిని అనుకరించాలంటే.. అనుసరించాలంటే నూటికి నూరు శాతం సాధ్యం కాదు. కానీ దీన్ని చేసి చూపించారు మాజీ మంత్రి విడుదలైన రజిని. ఇటీవల విడదల రజిని తన నివాసం నుంచి బయటికి […]

విడదల రజిని: సేమ్ అదే డైలాగ్.. సేమ్ అదే ఎక్స్‌ప్రెషన్.. ఏ మాత్రం తేడా లేదు.. చేతులు పైకి లేపి హెచ్చరించడం.. కళ్ళు మూసుకొని మాట్లాడటం.. హావభావాలను ప్రదర్శించడం.. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. అచ్చం జగన్ నే.. ఎవరైనా సరే ఒక మనిషిని అనుకరించాలంటే.. అనుసరించాలంటే నూటికి నూరు శాతం సాధ్యం కాదు. కానీ దీన్ని చేసి చూపించారు మాజీ మంత్రి విడుదలైన రజిని.

ఇటీవల విడదల రజిని తన నివాసం నుంచి బయటికి రాకుండా పోలీసులు గృహ నిర్బంధం కోసం ప్రయత్నించారు. ఈ సమయంలో ఒక ఎస్సై తో రజిని వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కింద పడిపోయారు.. ఇక అప్పటినుంచి ఆమె సెంటిమెంట్ రాజకీయాలను మొదలుపెట్టారు. నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారు.. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అక్కడితోనే ఆగిపోలేదు.. పోలీసులను తమ మీదికి పంపిస్తున్నారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అటువంటి అధికారులను వదిలిపెట్టడం లేదని.. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే తీసుకొస్తామని.. వడ్డీతో సహా అందజేస్తున్నారని చెప్పారు.

ఇలాంటి కామెంట్లు.. ఈ తరహా ఆస్కార్ లెవెల్ ఎక్స్‌ప్రెషన్ వీడియోలు టీవీకి.. సాక్షి పత్రిక సాక్షికి ఉపయోగపడతాయి. అయితే ఇందులో కూడా నెగిటివ్ కామెంట్లే వస్తాయి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజిని ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. చివరికి రైతుల దగ్గర్నుంచి లంచాలు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశారు. ఇక్కడితోనే ఆగిపోలేదు.. రజని వేధింపుల వల్ల ఇబ్బంది పడ్డ వారంతా పోలీస్ కేసులు పెడితే.. దర్యాప్తులో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. గతంలో రజనీకి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తి అడ్డగోలుగా వ్యవహారాలు చేస్తే పోలీసులు పట్టుకోడానికి వచ్చారు. ఆ సమయంలో రజిని ఉమెన్ కార్డు అప్లై చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఒకప్పుడు చంద్రబాబు సైబరాబాద్ లో నాటిన మొక్క నేను అంటూ గొప్పగా చెప్పుకున్న రజిని.. ఆ తర్వాత వైసీపీలోకి ఎలా వెళ్లారు.. మంత్రి ఎలా అయ్యారు అనే విషయాలు అందరికీ తెలుసు.. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ప్రజాప్రతినిధుల మీద.. టిడిపి కేంద్ర కార్యాలయం మీద చేసిన దాడులు.. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అందుకే ఇప్పుడు కర్మ ఇస్ బ్యాక్ అనే సిద్ధాంతం వైసిపికి వాస్తవంలో బోధపడుతోంది. అయినా సాక్షి టీవీ ముందు.. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఇచ్చారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird