Home సినిమా ఒప్పో కొత్త టాబ్లెట్.. పేరు కొత్తది.. ఫీచర్లు పాతవేనా? – Andhra Waves

ఒప్పో కొత్త టాబ్లెట్.. పేరు కొత్తది.. ఫీచర్లు పాతవేనా? – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఒప్పో కొత్త టాబ్లెట్.. పేరు కొత్తది.. ఫీచర్లు పాతవేనా?


ఒప్పో నుంచి మరో కొత్త టాబ్లెట్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పో ప్యాడ్ 6 ఎఫ్ లైట్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ డివైజ్ తాజాగా TÜV సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. దీనితో టాబ్లెట్ మోడల్ నంబర్, ఛార్జింగ్ కెపాసిటీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ద టెక్ అవుట్ నివేదిక ప్రకారం.. ఈ మోడల్ మోడల్ నంబర్ OPD2615. TUV సర్టిఫికేషన్‌లో దీనికి JPTUV-194268 నంబర్ నమోదైంది. ఈ సర్టిఫికేషన్‌ను అక్టోబర్ 12, 2026న జారీ చేసినట్లు సమాచారం. డేటాబేస్‌లో ఒప్పో బ్రాండ్‌తో పాటు ఈ డివైజ్‌ను టాబ్లెట్‌గా సూచిస్తుంది. ఇలాంటి సర్టిఫికేషన్లు సాధారణంగా కొత్త డివైజ్ మార్కెట్లోకి వచ్చే ముందు కనిపిస్తాయి. అయితే సర్టిఫికేషన్ వచ్చిందంటే వెంటనే లాంచ్ అవుతుందని అర్థం కాదు.

45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్?
సర్టిఫికేషన్‌లో ఇచ్చిన పవర్‌ వివరాల ప్రకారం.. ఈ టాబ్లెట్‌కు గరిష్ఠంగా సుమారు 45W ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సూచిస్తుంది. 5V వద్ద 2A లేదా 5V–11V పరిధిలో 4.1A ఇన్‌పుట్ రేటింగ్‌ను లిస్టింగ్‌లో పేర్కొన్నారు. అయితే బ్యాటరీ కెపాసిటీ ఎంత? పూర్తి ఛార్జింగ్‌కు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఛార్జింగ్ స్పీడ్ రియల్ టైం వినియోగంలో అడాప్టర్, కేబుల్, బ్యాటరీ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

ఒప్పో ప్యాడ్ మినీకి మరో పేరుతో వస్తుందా?
ఈ మోడల్ నంబర్ గతంలో UAE TDRA సర్టిఫికేషన్‌లోనూ కనిపించింది. OPD2615 నంబర్ చైనాలో విడుదలైన ఒప్పో ప్యాడ్ మినీ మోడల్‌తో సరిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే కొన్ని మార్కెట్లలో ఒప్పో ప్యాడ్ మినీ ఒప్పో ప్యాడ్ 6 ఎఫ్ లైట్ పేరుతో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే రెండు పేర్లతో వచ్చే డివైజ్‌ల ఫీచర్లు పూర్తిగా ఒకేలా ఉంటాయని కంపెనీ నిర్ధారించలేదు.

ఇది కూడా చదవండి: సెల్ఫీతోనే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పేస్తుంది

ఒప్పో ప్యాడ్ మినీ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఒప్పో ఇటీవల భారత్‌లో ప్యాడ్ మినీ మ్యాట్ డిస్ ప్లే ఎడిషన్ ను ప్రకటించింది. ఇందులో 8.8 ఇంటా 2.5K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ ఉన్నాయి. 67W ఫాస్ట్ ఛార్జింగ్, 13MP వెనుక కెమెరా, 8MP ముందు కెమెరా కూడా ఉన్నాయి. భారత్‌లో 8GB RAM, 256GB వేరియంట్ ధర రూ.94,999గా రేజ్. అయితే ఇవి ప్యాడ్ మినీ వివరాలు మాత్రమే.. Pad 6 F Liteku ఇవే ఫీచర్లు ఉంటాయని ఇంకా నిర్ధారణ లేదు.

ఇది కూడా చదవండి:కిందపడినా పగలదు.. హానర్ కొత్త ట్యాబ్లెట్

ధర, లాంచ్ తేదీపై ఇంకా క్లారిటీ లేదు
ఒప్పో ప్యాడ్ 6 ఎఫ్ లైట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, భారత్‌లో విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఇది నిజంగా తక్కువ ధరలో వచ్చే టాబ్లెట్టా? లేక ప్యాడ్ మినీకి మరో మార్కెట్ పేరు మాత్రమేనా? అనే విషయాలు కంపెనీ తర్వాత ప్రకటన స్పష్టమవుతుంది. కాబట్టి ప్రస్తుత 45W ఛార్జింగ్ వివరాలను మినహాయించి మిగిలిన ఫీచర్లను అంచనాలుగానే చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird