Home సినిమా పండగ పూట టెస్లా కారు కొనేసిన రాహుల్ సిప్లిగంజ్! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. – Andhra Waves

పండగ పూట టెస్లా కారు కొనేసిన రాహుల్ సిప్లిగంజ్! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
పండగ పూట టెస్లా కారు కొనేసిన రాహుల్ సిప్లిగంజ్! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..


దేశవ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. విజయదశమి రోజున కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ దసరా పండుగ సందర్భంగా కొత్త కారును కొనుగోలు చేశాడు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

దసరా సందర్భంగా కొత్త కారు

రాహుల్ సిప్లిగంజ్ తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి కొత్త కారు ముందు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రత్యేకమైన కొత్త కారును కొనుగోలు చేసినట్లు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన అభిమానులు, నెటిజన్లు రాహుల్ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

రూ.70 లక్షల విలువైన టెస్లా కారు

రాహుల్ సిప్లిగంజ్ కొనుగోలు చేసిన కొత్త కారుస్లా అని, దాని ధర సుమారు రూ.70 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలో మార్పులు ఉండవచ్చు. ఇప్పటికే రాహుల్ రేజీలో మెర్సిడెస్ బెంజ్, వోల్వో లగ్జరీ కార్లు వంటి గ్యారీలు ఉన్నాయి. తాజాగా టెస్లా కారు కూడా ఆయన కార్ల జాబితాలో చేరింది.

రచయిత అవతార్

సయ్యద్ నాగ్ పాషా

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. iDreamPost.comలో చీఫ్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ డెస్క్ వర్క్‌తో పాటు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్, లైఫ్ స్టైల్, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ కంటెంట్ కూడా రాస్తుంటాను. జర్నలిజం వృతిలోకి 2018లో వచ్చాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి జర్నలిజం స్కూల్ నుంచి ఈ జర్నీ మొదలైంది. ఆ తర్వాత సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌, సుమన్‌ టీవీ, టీవీ9 డిజిటల్‌లో సేవలు అందించాను.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird