Home ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి: 11:11:11:11.. జగన్ ను దసరా పూట ఇంతలా – Andhra Waves

విజయసాయి రెడ్డి: 11:11:11:11.. జగన్ ను దసరా పూట ఇంతలా – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


విజయసాయి రెడ్డి: ఇది మామూలు ర్యాగింగ్ కాదు. ఒక రేంజ్ లో. అలాగని పేరు పెట్టలేదు. ఒక రేంజ్ లో ఆరోపణలు చేశారు. నేరుగా పేరు ప్రస్తావించలేదు. జస్ట్ తనకు అలవాటయిన స్థాయిలో.. త్రివిక్రమ్ మాటలాగా.. జంధ్యాల పంచ్ లాగా.. సూటిగా.. సుత్తి లేకుండా.. బాణాల లాంటి మాటలతో. నిజానికి ఇటీవల కాలంలో ఈ స్థాయిలో జగన్ ను ఎవరూ విమర్శించలేదు. సూటిగా తగిలేలాగా ఎత్తి పొడవలేదు. ఏపీ రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని రాజ్యసభ […]

విజయసాయి రెడ్డి: ఇది మామూలు ర్యాగింగ్ కాదు. ఒక రేంజ్ లో. అలాగని పేరు పెట్టలేదు. ఒక రేంజ్ లో ఆరోపణలు చేశారు. నేరుగా పేరు ప్రస్తావించలేదు. జస్ట్ తనకు అలవాటయిన స్థాయిలో.. త్రివిక్రమ్ మాటలాగా.. జంధ్యాల పంచ్ లాగా.. సూటిగా.. సుత్తి లేకుండా.. బాణాల లాంటి మాటలతో. నిజానికి ఇటీవల కాలంలో ఈ స్థాయిలో జగన్ ను ఎవరూ విమర్శించలేదు. సూటిగా తగిలేలాగా ఎత్తి పొడవలేదు.

ఏపీ రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు.. వైసిపి మాజీ నాయకులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు తన కొత్త పార్టీ ప్రకటన తేదీని.. ముహూర్తాన్ని కూడా ఏర్పాటు చేసింది. అన్ని 11 లు వచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి విజయదశమినాడే పార్టీని స్థాపించారని విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ పేరును దసరా రోజు కాకుండా.. వచ్చేనెల 11వ తారీఖు , 11 గంటల 11 నిమిషాలకు బెజవాడలోని ఏ కన్వెన్షన్‌లో తన నూతన పార్టీ పేరును.. ఆవిర్భావానికి గురిచేసింది.

2024లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి ఏపీలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పడిపోయింది. ఇక అప్పటినుంచి 11 అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు. విపక్ష హోదా కూడా వైసిపికి లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ 11 సంఖ్య వైసిపి నాయకులకు.. జగన్ కు పీడకల మాదిరిగా మారిపోయింది. అసలే 11 సంఖ్యను టిడిపి.. జనసేన నాయకులు పదేపదే గుర్తు చేస్తున్న నేపథ్యంలో.. అది వైసిపి నాయకులకు రాచపుండు లాగా మారిపోయింది.. దానిమీద కారచల్లే విధంగా విజయసాయి రెడ్డి నటిస్తున్నారు. విజయసాయి రెడ్డి గతంలో జగన్ కు ఆర్థిక.. రాజకీయ సలహాదారుగా పనిచేశారు. ఒక రకంగా లెక్కల మాస్టర్ గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు అదే లెక్కలతో జగన్ ను గట్టిగా దెబ్బ కొడుతున్నారు.

తేదీలు.. గంటలతోనే విజయసాయిరెడ్డి ఆగిపోవడం లేదు. జగన్ పరిపాలనను.. వైసిపి మూలాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. జన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా.. హత్య రాజకీయాల నుంచి విముక్తి కల్పించే విధంగా.. కుటుంబ పార్టీల దోపిడీకి ముగింపు పలికే తన పార్టీ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, బానిసల మాదిరిగా మార్చుకున్నారని.. జేజేలు కొట్టే యంత్రంగా రూపొందించారని.. ఇవన్నీ కూడా రావణాసురుడి అవలక్షణాలని.. మొత్తంగా పది పాయింట్లతో జగన్ రాజకీయ తీరును విజయసాయిరెడ్డి సర్ఫ్ ఎక్సెల్ తో ఉతికించారు. పార్టీ ప్రారంభం కాకముందే విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో ఉంటే.. పార్టీని ప్రారంభించిన తర్వాత ఎలా ఉంటారో.. వైసీపీని ఎలా ఆడుకుంటారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird