హరిణి మృతి కేసు: ఖమ్మం నగరంలో 18 సంవత్సరాల వయస్సులో ఇంద్రవల్లి హరిణి అనే యువతి మృతి కేసు మరో మలుపు తిరిగింది. హరిణిని మొదట అనుమానాస్పద మృతి అనుకున్నారు. అయితే పోస్టుమార్టం లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె మృతిని హత్యగా పోలీసులు మార్చారు. అసలు ఏం జరిగిందంటే హరిణి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం. ఈమె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి […]
హరిణి మృతి కేసు: ఖమ్మం నగరంలో చదువుతున్న 18 ఏళ్ల ఇంద్రవల్లి హరిణి అనే యువతి మృతి కేసు మరో మలుపుతీసుకుంది. హరిణిని మొదట అనుమానాస్పద మృతి అనుకున్నారు. అయితే పోస్టుమార్టం లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె మృతిని హత్యగా పోలీసులు మార్చారు.
అసలు ఏం జరిగిందంటే
హరిణి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం. ఈమె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి సెలవులు రావడంతో సొంత ఊరుకు వచ్చింది. ఆమె 22న ఆమె తల్లి రాజేశ్వరి కొద్దిసేపు పని ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఆ సమయంలో హరిని ఒక్కతే ఉన్నది. రాజేశ్వరి ఇంటికి రాగానే హరిణి కనిపించలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వెతికింది. ఇంటి బాత్రూం వెనుక భాగంలో హరిణి చనిపోయి కనిపించింది. హరిణి మృత దేహం పై గాయాలు ఉన్నాయి. మెడ పై నలిమిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో రాజేశ్వర్ కి మొదటి నుంచే అనుమానం మొదలైంది. పోలీసులు క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు. ఘటన స్థలంలో అనేక ఆధారాలు సేకరించారు.
పోస్ట్మార్టం అనంతరం
వైద్యులు కీలక పోస్టుమార్టం అనంతరం. గొంతు నులిమి చంపడం వల్లే హరిణి చనిపోయిందని పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు.. అయితే ఆమెపై దాడి జరిగినట్టు లేవని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందుగా నమోదు చేసిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసు లాగా మార్చారు. హరిణి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదులో ఇదే గ్రామానికి చెందిన 20 సంవత్సరాల డి పవన్ కుమార్ పై అనుమానం వ్యక్తం చేసింది. హరిణి ని పెళ్లి చేసుకోవాలని పవన్ కుమార్ కొద్దిరోజులుగా ఆమెను వేధించేవాడు. పెళ్లి కానుక చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఇది కేవలం రాజేశ్వరి వ్యక్తం చేసిన అనుమానం మాత్రమే.. ఇంతవరకు ఈ నేరం కోర్టులో నిరూపణ కాలేదు. ఈ కేసులో మొదట జరిగిన ప్రచారంలో కొంత వ్యత్యాసం. మొదట్లో హరిణి మృతిని అనుమానస్పద మృతిగానే పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో హరిణి గొంతు నులమడం వల్లే చనిపోయిందని వైద్యులు చెప్పడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ
ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇటీవల బాధిత కుటుంబానికి న్యాయం చేసిన మహిళా సంఘాల నాయకులు రోడ్డుమీదికి వచ్చి ధర్నా చేశారు. ఆందోళన ఉంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుమీద ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగింది.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు కూడా ఈ కేసులో అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
