Home సినిమా Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. – Andhra Waves

Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Aadarsha Kutumbam:వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగాయి . కానీ సినిమా విడుదల నిమిషంలో మాత్రం మొదటి నుంచి గందరగోళమే ఏర్పడింది. ముందుగా అక్టోబర్ 2 న విడుదలైంది. ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. ఇప్పుడు అక్టోబర్ 9 కూడా సాధ్యం కాదని అంటున్నారు. దీంతో ఈ సినిమా […]

ఆదర్శ కుటుంబం:వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగాయి . కానీ సినిమా విడుదల నిమిషంలో మాత్రం మొదటి నుంచి గందరగోళమే ఏర్పడింది. ముందుగా అక్టోబర్ 2 న విడుదలైంది. ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. ఇప్పుడు అక్టోబర్ 9 కూడా సాధ్యం కాదని అంటున్నారు. దీంతో ఈ సినిమా విడుదల అవుతుందా.. లేదా అనేది పెద్ద చర్చగా మారింది.

నిజానికి ఈ సినిమా వాయిదా కాదు.. వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ఇచ్చిన వరుస క్లారిటీలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అక్టోబర్ 1 విడుదలపై ఊహాగానులు పెరిగిన నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా చాలా స్పష్టంగా స్పందించారు. విడుదల సమయంలో తమపై అనుమానాలు ఉండవని.. కానీ ఈసారి ఎటువంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. అక్టోబర్ 9న సినిమా విడుదల కావడం ఖాయమని అన్నారు. అంతేకాదు అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 7న 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతుంది. ప్రీమియర్స్ ఉండవని.. నేరుగా రెగ్యులర్ షోలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని. అలా ప్రకటన చేసిన కొద్ది రోజులకే మల్లి సినిమా వాయిదా పడుతోంది అనే వార్తలు రావడం ఇప్పుడు అసలు ప్రశ్నలకు దారి తీస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ముఖ్యంగా రికార్డింగ్/ సౌండ్ కు సంబంధించిన పనులు ఇంకా పూర్తికాలేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఇవి అధికారికంగా నిర్మాతలు వెల్లడించిన కారణాలు కావు. కొన్ని మీడియా సంస్థలు వచ్చిన కథనాలు మాత్రమే ఈ ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. అనే నమ్మకాన్ని టీం కలిగిస్తోంది. మళ్లీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోస్ట్ ప్రొడక్షన్ పనుల పేరుతో కొత్త సందేహాలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రేక్షకులకు ఒక రకమైన కన్ఫ్యూజన్ కారణం.

ఒక సినిమా బాధపడితే నిర్మాతకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు చివరి నిమిషంలో టెక్నికల్ పనుల వల్ల విడుదల తేదీలు మారిపోతూ ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది కొత్త కాకపోయినా.. వరుసగా తేదీలు మారుతూ.. ఆ తర్వాత ఇక మార్పు ఉండదు అని నిర్మాత స్వయంగా క్లారిటీ ఇవ్వటం.. ఆ తర్వాత మళ్లీ వాయిదాలు రావడంతో సినిమా టీం కమ్యూనికేషన్ పై ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదర్శ కుటుంబం విడుదల విషయంలో ప్రేక్షకులు పలుమార్లు తేదీలు. మొదట సమ్మర్ రిలీజ్ గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ రెండవ తేదీని ప్రకటించారు. అది అక్టోబర్ 9కి మారింది.. ఇప్పుడు అక్టోబర్ 9 పై కూడా నిర్మాత స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే తేదీ పై మల్లి ఒక రకమైన సందిగ్ధం ఏర్పడింది. ఇలాంటి ప్రశ్నలలో సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. నిజంగా సినిమా ఎప్పుడు విడుదలవుతుంది..

ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల కథనాలలో అక్టోబర్ 30 తేదీని కొత్త విడుదల తేదిగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ తేదీపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి దానిని ఖరారైన తేదీగా చెప్పడం సబబు కాదు. అయితే అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా తప్పుకుంటే నిర్మాతలు మరో తేదీని ప్రకటించే ముందు పూర్తి క్లారిటీతో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం రిలీజ్ డేట్ మార్పు కాదు.. సినిమాపై ప్రేక్షకుల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే అంశం..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird