Home Latest News పుంగనూరు హింస వెనుక పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర: బీసీవై అధినేత రామచంద్రయాదవ్ సంచలన ప్రకటన.! | పుంగనూరు హింస వెనుక పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర | పుంగనూరు దాడులు | రామచంద్ర యాదవ్ | మిథున్ రెడ్డి – Andhra Waves

పుంగనూరు హింస వెనుక పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర: బీసీవై అధినేత రామచంద్రయాదవ్ సంచలన ప్రకటన.! | పుంగనూరు హింస వెనుక పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర | పుంగనూరు దాడులు | రామచంద్ర యాదవ్ | మిథున్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


స్థానిక ఎన్నికల వేళ పుంగనూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల మున్సిపల్ నామినేషన్ల ఘట్టం తొలిజే ఘర్షణలకు వేదికగా మారింది. అయితే ఈ పరిస్థితి తలెత్తడం వెనుక వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుంగనూరులో శుక్రవారం (అక్టోబర్ 16)న జరిగిన ఘర్షణలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం నడిపిన కుట్ర అన్నారు బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్. ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రకు తాను స్వయంగా ప్రత్యక్ష సాక్షిని ప్రకటించి సంచలనం సృష్టించారాయన.

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నామినేషన్ దాఖలు చేయడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులతో కలిసి చేరుకున్న తరుణంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కాన్వాయ్‌లోని వాహనాలు తమ కార్యకర్తలపైకి దూసుకెళ్లాయని, వైసీపీ వర్గీయులు భౌతిక దాడికి దిగారని తెలుగుదేశం వర్గీయులు అంటున్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి వాహన శ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి, నామినేషన్ల కేంద్రం ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాల నినాదాలు, తోపులాటలతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం.

ఈ పరిణామాలపై స్పందించిన రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, పుంగనూరులో చెలరేగిన హింస యాదృచ్ఛికం కాదని, ముందే పక్కాగా రచించిన పథకం అని తెలిపారు. తాను దీక్షలో ఉన్న సమయంలో రాత్రి వేళ మేడపైకి వెళ్లగా, పక్కనే ఉన్న గెస్ట్ హౌస్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి తన అనుచరులు, గూండాలతో సమావేశమై ఈ దాడులకు సంబంధించిన వ్యూహాన్ని రూపొందించడాన్ని గమనించానని, ఆ కుట్రను, పన్నాగాలను తాను స్వయంగా కళ్లారా చూశానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను భగ్నం చేసేందుకే పెద్దిరెడ్డి కుటుంబం ఈ తరహా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నదని.

ఈ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఇదే తరహాలో ఉమ్మడిగా పలు ప్రాంతాల్లో కూడా నామినేషన్ల కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పుంగనూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం ఉధృతమయ్యే అవకాశం ఉన్నందున, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం, కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

[Peddireddy Family Conspiracy Behind Punganuru Violance, Punganur Attacks, Ramachandra Yadav, Mithun Reddy, Telugu One]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird