Home ఆంధ్రప్రదేశ్ YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు – Andhra Waves

YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ సంఘటన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానించింది. పకడ్బందీ ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా విచారిస్తారని. విశ్వసనీయ వర్గాల సమాచారం […]

వైఎస్ వివేకానంద రెడ్డి కేసు: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ సంఘటన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానించింది. పకడ్బందీ ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా విచారిస్తారని. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 14ల అవినాష్ రెడ్డిని విచారిస్తారని. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించబోతున్నారనే వార్తలు రావడంతో.. తదుపరి రాజకీయ పరిణామాలపై అత్యంత ఆసక్తి నెలకొంది.

40 కోట్ల సుపారి

వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ గతంలోనే అనేక కోణాలలో విచారణ సాగించింది. 40 కోట్ల సుపారీ ఒప్పందం ఈ కేసులో అభియోగాలు రావడంతో.. సిబిఐ ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాదు, దర్యాప్తులో అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. అవి అనేక రకాలుగా చర్చకు దారితీసాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ప్రస్తుతానికి పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. భారీగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఈ ఆర్థిక వ్యవహారాల వెనుక ఎవరు ఉన్నారు.. నిధులు ఎవరి వద్దకు చేరుకున్నాయి.. అనే అంశాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. 40 కోట్ల సుపారీకి సంబంధించిన అభియోగాలు.. వాటి ఉన్న వ్యక్తులు.. ఆర్థిక వ్యవహారాల తుది నిర్ధారణకు రావాలంటే ఇంకా కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.

డ్రైవర్ దస్తగిరి అప్రూవర్

వివేకానంద రెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. దస్తగిరి తో పాటు సునీల్ యాదవ్.. ఎర్ర గంగిరెడ్డి. ఉమా శంకర్ రెడ్డి వంటి వారి పేర్లు గతంలో దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చాయి. ఈ కేసులో సిబిఐ విచారణ.. న్యాయపరమైన పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆర్థిక లావాదేవీల కోణం కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు కొత్త వివరాలు కూడా దర్యాప్తులో ఈడీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీచేసి.. పూర్తి విచారణ చేసిన తర్వాత.. ఈడీ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.

విచారణలో ఏం తేలుతుంది

శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణలో ఏం తేలుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 14న అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారనే వార్తలు ఈ తదుపరి పరిణామాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు.. ఎలాంటి ఆధారాలు ముందు పెడతారు అంటే.. క్లారిటీ రావాల్సి ఉంది.

రాజకీయంగా వేడి

వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలలో ఎన్నో మలుపులకు కారణమైంది. గతంలో సిబిఐ దర్యాప్తు సాగించడం.. నిందితులపై ఆరోపణలు.. ఆ స్థానంలో కొనసాగుతున్న విచారణలు.. రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తు అంశం తెరమీదకి రావడంతో ఈ కేసు మరోసారి రాజకీయంగా చర్చకు కారణం. ఈడీ విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది అధికారిక సమాచారం ద్వారానే తెలుస్తాయి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird