Home Latest News పంజాబ్ ను చిత్తు చేసి పాయిట్ల పట్టికలో అగ్రస్థానానికి హైదరాబాద్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఔట్ పంజాబ్ కింగ్స్ | చేరుకుంటుంది | టాప్ | స్థలం | పాయింట్లు | పట్టిక – Andhra Waves

పంజాబ్ ను చిత్తు చేసి పాయిట్ల పట్టికలో అగ్రస్థానానికి హైదరాబాద్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఔట్ పంజాబ్ కింగ్స్ | చేరుకుంటుంది | టాప్ | స్థలం | పాయింట్లు | పట్టిక – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. బుధవారం (మే6) ఉప్పల్ వేదికగా పంజాబ్ కిగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయింది మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది 235 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో ఆరంభ పరుగుల వర్షం కురిపించారు.

తరువాత 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయింది 202 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ జట్టులో యువ ఆటగాడు కూపర్ కానెల్లీ కేవలం 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం నిష్ప్రయోజనం అయ్యింది. ఇతర బ్యాటర్లు సన్ రైజర్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.

హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. పంజాబ్ ఫీల్డింగ్ లోపాలు కూడా హైదరాబాద్ భారీ స్కోరు సాధించడానికి ఒక కారణంగా మారాయి. హైదరాబాద్ బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

ప్రస్తుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలు నమోదు చేసి, మొత్తం 14 పాయింట్లతో టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది. అంతకుముందు అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird