Home సినిమా ఫ్యాన్స్ అసంతృప్తి.. దయచేసి మా మాట పట్టించుకోండి – Andhra Waves

ఫ్యాన్స్ అసంతృప్తి.. దయచేసి మా మాట పట్టించుకోండి – Andhra Waves

by
0 comments
ఫ్యాన్స్ అసంతృప్తి.. దయచేసి మా మాట పట్టించుకోండి


-అసంతృప్తిలో చిరు, రవితేజ ఫ్యాన్స్..
-టైటిల్ విషయంలో షేకవుతున్న సోషల్ మీడియా..
-అసలు కథ తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ

అభిమాని లేనిదే హీరోలు లేరు అనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఈ నిజాన్ని జస్టిఫై చెయ్యాలంటే ఆలోచన ఎవరికి రాదు. ముక్కోటి దేవతలు సైతం అభిమాని లేనిదే హీరోలు లేరని ముక్త కంఠంతో ఆమోద ముద్ర వేసే పరిస్థితి. ఇప్పుడు ఆ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి),మాస్ మహారాజా రవితేజ(రవితేజ)కి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఆ విజ్ఞప్తి ఏంటో చూద్దాం.

చిరు,బాబీ ల మూవీ మరికొద్ది రోజుల్లో షూటింగ్ కి వెళ్లనుంది. ఈ మూవీకి ‘కాకాజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతునట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం కన్ఫార్మ్ టైటిల్ అనే హోదాలో ఉంది. దీంతో మెజారిటీ మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో తిష్ట వేసి ‘చిరంజీవి వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి ‘కాకాజీ’ టైటిల్ ఏమాత్రం సెట్ అవ్వదు. పైగా చాలా సాఫ్ట్‌గా ఉండటంతో పాటు వినడానికి ఇబ్బందిగా ఉంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ అని పవర్ ఫుల్ పేరు పెట్టిన బాబీ, ఇప్పుడు ఇలాంటి టైటిల్ అనుకోవడం ఏంటి? దయచేసి టైటిల్ కాకాజీ కాదని నోట్ రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.
ఇక రవితేజ ‘రాజా రాజా చోర’ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో ఒక మూవీ కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ‘అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం. రవితేజ మార్కు మాస్ ఎలిమెంట్స్ ఆశించే అభిమానులకి ఈ టైటిల్ అస్సలు మింగుడు పడటం లేదు. మాస్ మహారాజా అని పిలుచుకునే మా హీరోకి ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ టైటిల్ ఏంటి? మొన్న చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ కొంచం విబిన్నంగానే ఉంది. కానీ అక్కాయిలు బాగున్నారా అనేది మరీ పాతకాలపు సినిమా పేరు. పైగా ఇమేజ్ కి సూటవ్వదు. దయచేసి ఆ టైటిల్ ని ఫిక్స్ చెయ్యకండి మహా ప్రభో అంటున్నారు.

ఇది కూడా చదవండి: నాగార్జున: 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన కన్ఫార్మ్

ఈ రెండు టైటిల్స్ కూడా ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి అధికారికంగా ప్రకటించబడలేదు. ఇవి కేవలం వర్కింగ్ టైటిల్స్ లేదా పరిశీలనలో ఉన్న పేర్లు మాత్రమే కావచ్చు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే, మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకోక తప్పేలా లేదు. గతంలో కూడా ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల చాలా సినిమాల టైటిల్స్ మారిన సందర్భాలు ఉన్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird