Home Latest News మిస్టరీ వీడని చర్లపల్లి తల్లీబిడ్డల సూసైడ్ కేసు | విజయారెడ్డి ఆత్మహత్య. తెలంగాణ ఆత్మహత్య కేసు| భువనగిరి| రైలు ప్రమాదం| కుటుంబంలో విషాదం| పోలీసుల విచారణ| ఆత్మహత్య మిస్టరీ| చర్లపల్లి రైల్వే స్టేషన్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

మిస్టరీ వీడని చర్లపల్లి తల్లీబిడ్డల సూసైడ్ కేసు | విజయారెడ్డి ఆత్మహత్య. తెలంగాణ ఆత్మహత్య కేసు| భువనగిరి| రైలు ప్రమాదం| కుటుంబంలో విషాదం| పోలీసుల విచారణ| ఆత్మహత్య మిస్టరీ| చర్లపల్లి రైల్వే స్టేషన్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


చర్లపల్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు ఢీకొని మృతి చెందిన ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉన్న కారణాలకు సంబంధించి పోలీసులు సెల్‌ఫోన్ అనాలసిస్ డేటా, వాట్సప్ కాల్స్, కాల్ లాగ్‌లతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా గుర్తించారు.పోలీసుల విచారణలో భాగంగా విజయ చని పోయే ముందు 24 గంటల వ్యవధిలో ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలించారు. విజయ సెల్‌ఫోన్‌లోని వాట్సప్, సాధారణ కాల్ డేటాను పరిశీలించినప్పుడు ఎలాంటి అనుమానాస్పద విషయాలు లేవని అధికారులు నిర్ధారించారు.

చివరి రోజు విజయ తన కూతురిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు పూజలు చేసిన విజయ, కొడుకు కూతురిని తీసుకొని బయటికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం విజయ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చిన విజయ, స్టేషన్‌కు చేరుకున్న తర్వాత తల్లికి ఫోన్ చేసి పిల్లలను తీసుకొని బయట ఫంక్షన్‌కు వచ్చానని చెప్పినట్లు కాల్ రికార్డ్స్ ద్వారా స్పష్టమైంది. అదే సమయంలో తన కార్యాలయానికి వాట్సప్ మెసేజ్ కూడా పంపినట్లు పోలీసులు తెలిపారు.

స్టేషన్‌కు చేరుకున్న తర్వాత విజయ తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను కారులోనే వదిలి, కారు కీస్‌ను కొడుక్కి ఇచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అనంతరం చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లలో దాదాపు అరగంటపాటు తిరిగినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైంది. ప్లాట్‌ఫార్మ్ నంబర్ ఒకటి, రెండు వద్ద పలుమార్లు తిరిగిన విజయ, ఆమె పిల్లలు ముగ్గురూ ప్రశాంతంగా మాట్లాడి సంచరించినట్లుగా సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు పేర్కొన్నారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాల వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన రైలు ముగ్గురిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. విజయకు 19 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెలకు సుమారు లక్ష రూపాయల జీతం పొందుతోంది. ఇంటి రెంట్ల ద్వారా అదనపు ఆదాయం ఉండగా, దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయ ఖాతాలోకి బదిలీ అవుతున్నట్లు విచారణలో వెల్లడైంది. పిల్లలకు ఐటి సీట్లు సాధించాలనే లక్ష్యంతోనే హాస్టల్‌లో ఉంచి చదివినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ ఘటనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌కు సంబంధించి పోలీసులు ఇలా వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కోరిక విజయ భర్త, సోదరుడు, తల్లి సహా పలువురిని పలుమార్లు విచారించారు. పిల్లల హాస్టల్స్, ఇంటి పరిసరాలు, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో దాదాపు 800కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. పిల్లలను రైల్వే స్టేషన్‌కు ఏమని చెప్పి పంపించారు. ముగ్గురూ ముందే సిద్ధమై వచ్చారా లేక తల్లి బలవం తంగా తీసుకునిందా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

స్టేషన్‌లో ముగ్గురు జాలీగా తిరుగు తున్నట్లు ఫుటేజీల్లో కనిపించడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో విజయ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అదే సంస్థలో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్‌గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మొబైల్ ఫోన్ కాల్ ఆధారంగా డేటా విచారణ కొనసాగుతోంది. ఆమె ఫోన్‌కు ఒక నంబర్ నుంచి “సారీ మేడం… ఇంకోసారి తప్పు చేయను” అని ఒక మెసేజ్, అలాగే “గుడ్ మార్నింగ్ మేడం” అంటూ మరో మెసేజ్ వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird