వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (సత్యదేవ్). ఆయన హీరోగా నటిస్తున్న” కొత్త చిత్రం “సమవర్తి (సమవర్తి) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది.
“సమవర్తి” సినిమా రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“సమవర్తి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్లు, కత్తులతో కొందరు దూసుకురాగా, ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
సమవర్తి అంటే యముడు, ఎవరి పట్ల పక్షపాతం లేనివాడు అని అర్థం. ఈ సమవర్తి శత్రువుల పాలిట యముడిలా మారి వారందరినీ ఎలాంటి తేడాలు లేకుండా ఒకేలా కనుమరుగు చేస్తాడని అనుకోవచ్చు. సత్యదేవ్ కెరీర్ లో ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ అవుతుందనే అంచనాలు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో రూపొందుతున్నాయి.
సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్స్ గా హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు, ఎడిటర్ గాన ఆదిత్య తివారి నటించారు.

