తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ విద్యా మండలి (TS BIE) శుభవార్త చెప్పింది. ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. 2027లో నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ అమలు చేయడం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు తమకు కేటాయించాల్సిన ఇతర కేంద్రాలకు అవసరం లేకుండా, తాము చదువుతున్న జూనియర్ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈమెరకు ఇంటర్ బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
పాత పద్ధతిలోనే పరీక్షల నిర్వహణ
సాధారణంగా ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు జంబ్లింగ్ విధానం అమలవుతుంది. అంటే, ఒక కాలేజీలో చదివే విద్యార్థులకు వేరే కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ఇదే తరహాలో ప్రాక్టికల్ పరీక్షలను కూడా ఇతర కాలేజీల్లో నిర్వహించాలని గతంలో అధికారులు ప్రతిపాదించారు. కానీ ఆ నిర్ణయం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అలానే ఈ సంవత్సరం కూడా అమల్లోకి రాలేదు. ఫలితంగా 2027 వార్షిక పరీక్షల్లోనూ పాత పద్ధతిలోనే సొంత కాలేజీల్లోనే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
మరోవైపు, ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ లేకపోవడంపై విద్యార్ధుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్, నిబంధనల లేకుండా కాలేజీల్లో మూల్యాంకనం సరైన విద్యార్థులకు పూర్తి మార్కులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైన్స్ విద్యార్థులు అంటే ఎంపీసీ, బైపీసీ చదివే వారికి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఒక్కో ప్రాక్టికల్ సబ్జెక్టుకు 30 మార్కులు కేటాయిస్తారు.
2027 ఇంటర్ ప్రాక్టికల్, థియరీ పరీక్షల పూర్తి షెడ్యూల్
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. బోర్డు షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు క్రింది విధంగా ఉన్నాయి:
- ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్: జనవరి 29, 2027
- ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్: జనవరి 30, 2027
- ద్వితీయ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్:ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 10 వరకు
- ప్రథమ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 18 వరకు
- ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు: ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం
- ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు: ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం
