Home సినిమా ఆ తెలుగు హీరోకి ఉన్న టాలెంట్ ఇండియాలో మరెవ్వరికీ లేదు.. తెలుగులో టాప్ అతనే! – Andhra Waves

ఆ తెలుగు హీరోకి ఉన్న టాలెంట్ ఇండియాలో మరెవ్వరికీ లేదు.. తెలుగులో టాప్ అతనే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలుగువన్ సినిమా


ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయ్. బుల్లెట్ దిగిందా లేదా? అనే డైలాగ్ ని బాగా నోట్ చేసుకోండి. ఈ న్యూస్ పూర్తిగా చదివాక మీరు కూడా చాలా గట్టిగానే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయ్. బుల్లెట్ దిగిందా లేదా? అని చెప్తారు. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే డ్రాగన్ వచ్చిన దాకా ఈ న్యూస్ చూస్తూ మురిసిపోతాం. దట్ ఈజ్ ఎన్టీఆర్ అని అనుకుంటూ ఉంటారు. మరి అసలు మ్యాటర్ చూద్దాం.

జెనీలియా డిసౌజా.. హా హా.. హాసిని అంటూ తెలుగు నాట తన గురించే ఆలోచించే ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. జెనీలియా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండియన్ నటులలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వారి గురించి అడిగినప్పుడు, ఆమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..

ఎన్టీఆర్ అద్భుతం, మహా అద్భుతం, ఎన్టీఆర్‌లో ఏదో ఒక డివైన్ పవర్ లేదని ఆ డివైనిటీ క్వాలిటీ ఎన్టీఆర్‌ని ఇతర నటుల నుంచి వేరు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. జెనీలియా ఎన్టీఆర్‌తో కలిసి సాంబ, నా అల్లుడు వంటి రెండు చిత్రాల్లో నటించారు. ఆయన నటనను దగ్గరగా చూసిన అనుభవంతోనే ఆమె ఈ ప్రశంసలు కురిపించారు.

ఎన్టీఆర్ మూడు పేజీల డైలాగులను ఎలాంటి కష్టం లేకుండా, జస్ట్ క్షణాల్లో పేపర్‌ను చూసి చెప్పగలరని, అది కూడా పర్ఫెక్ట్ యాక్సెంట్, పర్ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌లతో అని ఆమె వివరించారు. దీనిని “రోబో లాగా డైలాగ్ చెప్పడం” అని జెనీలియా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: యువతకి విక్టరీ పిలుపు: జీవితానికీ ఎస్ చెప్పండి!

భారతదేశంలోని ఏ నటుడికీ ఈ క్వాలిటీ లేదని జెనీలియా చెప్పడం ఎన్టీఆర్ ప్రతిభకు నిదర్శనం. నటనలో ఈ స్థాయి కచ్చితత్వం, వేగం, భావం కలగలిసిన అరుదైన ప్రతిభ ఎన్టీఆర్ సొంతం అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రతిభను, వ్యక్తిత్వాన్ని అభిమానులు ఎప్పటినుంచో ప్రశంసిస్తున్నప్పటికీ, సహ నటి జెనీలియా ఈ స్థాయిలో పొగడటం ఎన్టీఆర్ గొప్పదనానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ఇంకా తన పూర్తి టాలెంట్‌ను ఎన్టీఆర్ తెరపై చూపించలేదని, సరైన ప్రాజెక్ట్‌లు వస్తే ఆయన భారతదేశం గర్వించదగ్గ నటుడు అవుతారని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. ఈ 20 సంవత్సరాల ఇంటర్వ్యూ గతంలోనిది. అయినా కూడా రీసెంట్ గా సోషల్ మీడియాని రౌండ్ అప్ చేసాయి.

మీకు నచ్చవచ్చు

భోగి విషయంలో అనుపమ పరమేశ్వరన్ కి అన్యాయం జరిగిందా!

ఒకేసారి సాంగ్స్ రిలీజ్ చేస్తే ఎంత బాగుండు: సినిమాకే మంచింది కదా!

[Ntr, Genelia Deshmukh, Top Hero, Tollywood]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird