క్రికెట్ లో ఎన్నో ఔట్ లను చూసి ఉంటారు గానీ ఇలాంటి ఔట్ ని ఎప్పుడూ చూసి ఉండరు. బ్యాటర్ క్రీజ్ లోకి రాకముందే బౌలర్ బౌలింగ్ వేసి బౌల్డ్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. టీం మొత్తం కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఇదేదో గల్లీ క్రికెట్లోనూ లేకపోతే డొమెస్టిక్ క్రికెట్ కాదు అంతర్జాతీయ ప్లేయర్స్ ఆడే మ్యాచ్‌లో జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో ఈ విచిత్రమైన ఔట్ జరిగింది. మెల్బోర్న్ రెనెగెడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్‌కు చేరింది.
క్రీజులోకి ఆలస్యంగా వచ్చిన డియాండ్రా డాటిన్ బంతిని ఎదుర్కోకుండానే టైం అవుట్ అయ్యాడు.
క్రీజులో బ్యాటర్ లేకుండా బాల్ బౌల్డ్ చేయబడింది! 😅 https://t.co/C9RvfrLehV
— స్పోర్ట్స్గల్లీ క్రికెట్ 🏏 (@sportsgullycric) నవంబర్ 25, 2026
సాధారణంగా క్రీజులోకి ఆలస్యంగా వచ్చిన బ్యాటర్‌ను టైండ్ అవుట్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో డాటిన్‌కు అలాంటి శిక్ష విధించకుండా, మరో అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఆమె ఖాతాలో గోల్డెన్ డక్ నమోదైంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ కంపెనీ ఆడుతున్న డాటిన్ క్రీజులోకి రావడంలో ఆలస్యం చేసింది. దీంతో ఆమెను టైం అవుట్‌గా ప్రకటించకుండా, బంతిని ఎదుర్కొనేందుకు అవకాశం ఇచ్చారు. ఈ రూల్ ప్రకారం బౌలర్ వేసిన బంతి స్టంప్స్‌ను తాకకపోతే డాటిన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించవచ్చు.
అయితే బ్రిస్బేన్ హీట్ బౌలర్ సారా గ్లెన్ మాత్రం ఆ సౌకర్యాన్ని ఇవ్వలేదు. ఆమె బంతిని నేరుగా వికెట్లను తాకడంతో వేసిన డాటిన్ డకౌట్‌గా వెనుదిరిగింది. దీనితో డాటిన్ కు చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ఔటవడంతో ఈ ఘటన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. టార్గెట్ చేస్తూ 35 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన సమయంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించాలా? లేక మరో అవకాశం ఇవ్వాలా? అనే చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో డాటిన్‌కు అవకాశం ఇచ్చినా ఫలితం మారలేదు.
ఈ ఘటన మరోసారి క్రికెట్లో ఆట స్ఫూర్తి, రూల్స్ అమలు, ప్రత్యర్థి పట్ల క్రీడాకారులు అనుసరించాల్సిన వైఖరిపై చర్చకు తెరలేపింది. ఇలాంటి రూల్ అంతర్జాతీయ క్రికెట్ లో లేదు. అయితే ఈ ఒక్క మ్యాచ్ లోనే అప్పటికప్పుడు బ్యాటర్ కు అవకాశం ఇవ్వకుండా క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. టైమ్డ్ అవుట్ అయితే రూల్ ప్రకారం ఇంటర్నేషనల్ క్రికెట్ లో బ్యాటర్ గ్రౌండ్ లోకి కూడా అడుగుపెట్టడానికి అవకాశం లేదు. ఇలాంటి ఔట్ అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే చాలానే జరిగాయి. మరి ఈ విచిత్ర రూల్, ఈ వింత ఔట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములో తెలియజేయండి.
