Home సినిమా మహిళలనే వేధిస్తున్న మైగ్రేన్! – iDreamPost – Andhra Waves

మహిళలనే వేధిస్తున్న మైగ్రేన్! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
మహిళలనే వేధిస్తున్న మైగ్రేన్! - iDreamPost


తలనొప్పి వస్తే ఎవరైనా సాధారణ సమస్యగానే భావిస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ కొందరికి వచ్చే తలనొప్పి అంత సాధారణమైనది కాదు. తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి, కాంతిని చూడలేకపోవడం, శబ్దాలు భరించలేకపోవడం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బంది పెట్టే సమస్యే మైగ్రే. ముఖ్యంగా పురుషులతో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీనికి మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు ఒక ముఖ్యమైన కారణమని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.

మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి కాదు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మైగ్రే మహిళల్లో పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం మహిళలకు పురుషులతో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా మైగ్రే వచ్చే అవకాశం ఉంది.

బాల్యంలో అబ్బాయిలు, అమ్మాయిల్లో మైగ్రేన్ వచ్చే అవకాశాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కానీ యుక్తవయసు వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుంది. అమ్మాయిల్లో హార్మోన్ల మార్పులు మొదలవడంతో మైగ్రే సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.మహిళల్లో మైగ్రే ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ మార్పులు ఒకటి. ఈ హార్మోన్ మహిళల నెలసరి చక్రం, గర్భధారణ, ఇతర శారీరక మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

నెలసరి ప్రారంభమయ్యే ముందు కొందరు మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి. ఈ మార్పు మెదడులో నొప్పిని నియంత్రించే వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. దీనితో మైగ్రే దాడి వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే కొంతమంది మహిళలకు ప్రతి నెలా నెలసరి రావడానికి ముందు లేదా వచ్చిన సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. దీనిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు.

దీనితో పాటు వికారం, వంతులు, వెలుతురు చూడకపోవడం, శబ్దాలు భరించలేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. కొందరిలో తలనొప్పి రావడానికి ముందే కళ్ల ముందు మెరుపులు కనిపించడం, చూపుల్లో మార్పులు, చేతులు లేదా ముఖంలో తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మైగ్రేన్ ఆరా అంటారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మైగ్రే దాడి సాధారణంగా 4 గంటల నుండి 72 గంటల వరకు కొనసాగవచ్చు. అయితే ప్రతి ఒక్కరిలో లక్షణాలు, నొప్పి తీవ్రత ఒకేలా ఉండవు.

మెడ మహిళల్లో మైగ్రేన్ ఎక్కువగా రావడానికి హార్మోన్ల మార్పులు ఒక ముఖ్యమైన కారణం. అయితే జీవనశైలి, నిద్ర, ఒత్తిడి, జన్యుపరమైన అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి చాలామందికి సాధారణ సమస్యగా ఉంటుంది. కానీ అది మైగ్రేన్ అయి ఉండవచ్చు. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉందా? మైగ్రేన్ గురించి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird