న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో గెలవాల్సిన మ్యాచ్ లో డ్రా తో సరిపెట్టుకుంది. అయితే డ్రా చేసుకున్నా మన ప్లేయర్స్ మాత్రం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందుకు వెళ్లారు. కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అదుర్స్ అనిపించుకున్నారు. మరోవైపు బౌలర్లలో బుమ్రా అదరగొట్టి రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్ గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం..
మెరుగైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఐదో ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. తొలి టెస్ట్ ముందు ఐదో స్థానంలో ఉన్న బుమ్రా ఈ జాబితాలో ఐదు వికెట్లు తీసి టాప్-2కి వచ్చాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 856 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ సీమర్ ఓలీ రాబిన్సన్ కూడా 856 పాయింట్లతో బుమ్రాతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. గత నెలలో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్గా నిలిచిన దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ రెండు స్థానాలు దిగజారి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు.
న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ కూడా రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంకులో నిలిచాడు. దక్షిణాఫ్రికాకే చెందిన కగిసో రబాడ రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకోగా, సైమన్ హార్మర్ ఏడో అవార్డు నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సెంచరీతో దుమ్ములేపైన కేఎల్ రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకుకు చేరుకున్నాడు. 85 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు సంపాదించి తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు. పదో స్థానంలో ఉన్న శుభ్మన్ గిల్ మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 98 పరుగులు చేసిన కెప్టెన్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక 128 రన్స్ తో రెచ్చిపోయిన రిషబ్ పంత్ ఒక స్థానం ముందుకు జరిగి ఆరో ర్యాంక్ కు చేరుకున్నాడు. ప్లేయర్స్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో.. రూట్ రెండో స్థానంలో ఉంటే.
The post డ్రా అయినా ఆ ఐదుగురు ముందుకు appeared first on iDreamPost.
