
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వేళ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న అసమ్మతి ఉద్రిక్తతకు, దాడులకు దారితీసింది.
పార్టీ ప్రకటించిన వ్యతిరేకిస్తూ కొందరు నేతలు, కౌన్సిలర్లు నిరసనలకు దిగడంతో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పీఏపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, కూటమి తరపున పాతిక మంది ఉన్నారు. వీరిలో జనసేనకు 18 మంది సభ్యుల బలం ఉంది. సర్దుబాటులో భాగంగా పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి జనసేన సీట్ల కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వరరావు పేరును పార్టీ ప్రకటించింది.

అయితే ఈ ఎంపిక పార్టీలోని కౌన్సిలర్లు విభేదించారు. సార్వత్రిక ఎన్నికల పార్టీలో చేరిన వెంకటేశ్వరరావుకు కాకుండా, మొదటి నుంచి జనసేనలో పనిచేస్తున్న సంధ్యకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడానికి డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: కూటమిలో పిఠాపురం రచ్చ.. చంద్రబాబు గరం.. పవన్ కల్యాణ్ మౌనం!
ఈ, అసమ్మతి, అసంతృప్తి చినికిచినికి గాలివాన వివాదంగా మారింది. ఈ తీవ్రరూపం దాల్చి జనసేన నేతలు, కౌన్సిలర్లు కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ పీఏ చక్రిపై దాడి వివాదం వరకు వెళ్లింది.

చివరకు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. పిఠాపురంలో జనసేనలో ఏర్పడిన ఈ వర్గ పోరు, ఆందోళనల పరిణామాలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు
మీకు నచ్చవచ్చు: డంపింగ్ యార్డుకు కొత్త రూపం.. పిఠాపురంలో పీఠికాపుర వనం..!
సర్జరీ తరువాత తొలిసారిగా పవన్ పిఠాపురం పర్యటన.!
[Internaldispute, Pithapuram Jana Sena, Municipal Vice Chairman, assault, MP, TeluguOne]
