.webp)
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచరనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రధాన నిందితుడి చుట్టూ సాగిన దర్యాప్తు.. ఇప్పుడు ఆయన సోదరుడి వరకు చేరింది. కీలక సాక్ష్యాలను దాచిపెట్టడం, నిందితుడి గుర్తింపు బయటపడకుండా సహకరించడం వంటి ఆరోపణలతో పోలీసులు ఆయన సోదరుడిని కూడా రెండో నిందితుడిగా (A-2) చేర్చారు.
ఈ కేసులో కీలక ఆధారాలుగా సూసైడ్ అసలు కాపీతో పాటు, బాధితురాలికి సంబంధించిన వీడియోలు ఉన్న ఐఫోన్‌ను దాచిపెట్టడంలో సోదరుడి ప్రమేయం నోట్‌ను పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, ప్రధాన నిందితుడు వాట్సాప్ సందేశాలను పంపేందుకు సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ ఉన్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి అసలు గుర్తింపు బయటపడకుండా కూడా ఆయన సహకరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
సుమారు 30 ఏళ్ల వయసున్న ఏ-2 నిందితుడు గత నవంబర్ 3న ఉప్పరపల్లి స్థానిక కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. కోర్టు మేరకు సుమారు 15 రోజుల క్రితం అత్తాపూర్ పోలీసుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే, తాజాగా అతడిని ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసులో గతజులై 18న వేధింపుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధితురాలితో పాటు మరో నలుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారుల వాంగ్మూలాలను తీసుకున్న పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 64(1) (అత్యాచారం), 109 (హత్యాయత్నం)లను అదనంగా చేర్చారు.

ఓవైపు ప్రధాన నిందితుడు బెయిల్‌పై బయట ఉండగా.. మరోవైపు ఆయన సోదరుడిని కూడా నిందితుడిగా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సూసైడ్ నోట్, ఐఫోన్‌లోని డిజిటల్ ఆధారాల వ్యవహారం ఈ కేసులో కీలకంగా మారింది. సాక్ష్యాలను దాచిపెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా? ఈ కేసులో ఇంకెవరైనా పాత్ర ఉన్నట్లు బయటపడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.
మీకు నచ్చవచ్చు: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!
మీకు నచ్చవచ్చు: నాన్న ప్రాణాలకు ముప్పు ఉందని ముందే చెప్పా..రాజీవ్ హత్యపై రాహుల్ భావోద్వేగం.!
[ Trainee IPS Case, Sexual Harassment Case, IPS Officer, Accused Brother, Second Accused, A2 Accused, Evidence Tampering, Suicide Note, iPhone Evidence, Digital Evidence, WhatsApp Messages, Attapur Police, Upparpally Court, Anticipatory Bail ]
