Home సినిమా జూరెల్ సూపర్ క్యాచ్‌కు గిల్ ఫిదా – Andhra Waves

జూరెల్ సూపర్ క్యాచ్‌కు గిల్ ఫిదా – Andhra Waves

by andhra andhrawave
0 comments
జూరెల్ సూపర్ క్యాచ్‌కు గిల్ ఫిదా


న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి పాటల్లో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జూరెల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్‌లో ఫామ్‌లో ఉన్న కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. జూరెల్ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం ఫిదా అయ్యాడు. వికెట్ పడగానే జురెల్ దగ్గరకు గిల్ పరుగెత్తుకొచ్చి అభినందించాడు. ఈ క్యాచ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఆకట్టుకుంటుంది.

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిని నికోల్స్ వెనక్కి జరిగాడు. లెగ్ సైడ్ వైపు ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి తొడ ప్యాడ్‌ను తాకింది. దీంతో బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఉన్న జూరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో స్పందించాడు. బంతి దిశను అంచనా వేసి చాలా ఫాస్ట్ గా క్యాచ్ అందుకున్నాడు. దీనితో నికోల్స్ 31 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఈ వికెట్లకు ఎంతో కీలకంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో నికోల్స్ అద్భుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కివీస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అలాంటి బ్యాటర్ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకుంటున్న సమయంలోనే జూరెల్ క్యాచ్‌తో భారత్‌కు కీలక బ్రేక్‌త్రూ లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 368 పరుగులు చేసింది. అనంతరం భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.

కేఎల్ రాహుల్ 136 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా, రిషబ్ పంత్ 128 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 98 పరుగులు చేసి సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 85, దేవదత్ పడిక్కల్ 80 పరుగులు చేశారు. ధ్రువ్ జూరెల్ సైతం బ్యాట్‌తో మెరిసి 79 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

The post జూరెల్ సూపర్ క్యాచ్‌కు గిల్ ఫిదా appeared first on iDreamPost.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird