Home Latest News దేశ గౌరవపతాక: జాతీయ జెండా: మోడీ చర్య పట్ల దేశం అందరూ ఫిదా.! | నరేంద్రమోడీ | జాతీయ జెండా | క్వాడ్ సమ్మిట్ | జాతీయ జెండా గౌరవం – Andhra Waves

దేశ గౌరవపతాక: జాతీయ జెండా: మోడీ చర్య పట్ల దేశం అందరూ ఫిదా.! | నరేంద్రమోడీ | జాతీయ జెండా | క్వాడ్ సమ్మిట్ | జాతీయ జెండా గౌరవం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


అంతర్జాతీయ వేదికలపై జాతీయ జెండాపై తనకున్న అపారమైన గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చాటుకున్నారు. ఇటీవల ఫిలిప్పీన్స్ రాజధాని మానిలాలో జరిగిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భాగంగా ఏర్పాటు చేసిన గ్రూప్ ఫోటో సెషన్‌లో ప్రధాని మోదీ నిరాడంబరత, దేశభక్తి అందరినీ ఆకట్టుకుంది.

ఆసియాన్ సదస్సు, క్వాడ్ సమావేశాల నేపథ్యంలో వివిధ దేశాల అధినేతలు పాల్గొనే ఫోటో సెషన్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాయకులు ఎక్కడ నిలబడాలో సూచించేందుకు వీలుగా నేలపై ఉన్న దేశాల జాతీయ జెండాల గుర్తులు, నెమ్ కార్డ్స్‌ ఉంచారు. ఆ సమయంలో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తన స్థానానికి సమీపంలో నేలపై పడి ఉన్న భారత త్రివర్ణ పతాకపు గుర్తును గమనించారు.

ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే కిందకు వంగిన మోదీ, ఆ త్రివర్ణ పతాక చిహ్నాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా తీసుకున్నారు. జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీ ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. దేశంపై, జాతీయ జెండాపై ఒక దేశ ప్రధాని చూపించే గౌరవం ఏ స్థాయిలో ఉంటుందో ఈ సంఘటన నిరూపిస్తోందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ మోడీ చర్యను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వాధినేతగా మోడీ పాతికేళ్ల ప్రస్థానం: అభివృద్ధి జరిగింది.. రాజకీయ వివాదాలు.!

గతంలోనూ ఇలాంటి ఘటన ఒకటి గుర్తు చేస్తున్నారు. సౌతాఫ్రికాలో జరిగిన ప్రధాని బ్రిక్స్ సదస్సు సమయంలోనూ మోదీ సరిగ్గా ఇలాగే వ్యవహరించారు. నేలపై పడి ఉన్న భారత జాతీయ జెండా గుర్తును కిందనుంచి తీసి భద్రపరచుకున్న సంగతిని ప్రస్తావిస్తున్నారు.

దేశం పట్ల అంకితభావం కేవలం పెద్ద ప్రకటనలతోనే కాకుండా ఇలాంటి చిన్న చిన్న బాధ్యతాయుతమైన పనుల ద్వారా ప్రతిఫలిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశ ప్రధాని తన జాతీయ పతాకంపై చూపిన ఈ అపారమైన గౌరవం అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మీకు నచ్చవచ్చు: సీఎం చంద్రబాబుకు పీఎం మోడీ ఫోన్: తుపాన్ల నష్టంపై ఆరా.!

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అరుదైన ఆహ్వానం.. స్మిత్ మచ్చర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలనం.!

[NarendraModi, Nationalflag,  Quad Summit, NationalFlagRespect, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird