Home Latest News ట్రాఫిక్ కష్టాలకు చెక్: హైదరాబాద్ లో పాడ్ టాక్సీలు.! | PRTS | PodTaxis | హైదరాబాద్ | మెట్రో కనెక్టివిటీ | KPHB బయోడైవర్సిటీ PRTS – Andhra Waves

ట్రాఫిక్ కష్టాలకు చెక్: హైదరాబాద్ లో పాడ్ టాక్సీలు.! | PRTS | PodTaxis | హైదరాబాద్ | మెట్రో కనెక్టివిటీ | KPHB బయోడైవర్సిటీ PRTS – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


విశ్వనగరం ​​హైదరాబాద్ ను విశ్వనరకంగా మార్చేస్తున్న ట్రాఫిక్ చిక్కులకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం కనుగొంది. హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు.. ప్రధానంగా ప్రధానంగా మెట్రో రైలు స్టేషన్ల నుంచి కమ్యమూటర్స్ పడుతున్న ప్రయాణాల పరిష్కారానికి ప్రభుత్వం పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) అదే పాడ్ ట్యాక్సీల వ్యవస్థను తీసుకురావడం దృష్టిపై పెట్టింది. మెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మూడు ప్రధాన మార్గాల్లో రాకపోకలు కొంత మేరకు సులభతరమయ్యాయి. అయితే మెట్రో రైలు దిగి, మెట్రో స్టేషన్ బయటకు వచ్చిన తరువాత తమతమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు, తగిన ప్రజా రవాణా లేకపోవడం, క్యాబ్‌లలో అధిక ఛార్జీల వంటి సమస్యలుఎదుర్కొంటున్న వారు సులభంగా గమ్యస్థానం చేరుకోవడానికి వీలుగా ఈ ప్యాడ్ టాక్సీలను తీసుకురావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర అధ్యయనం అనంతరం ముఖ్యమంత్రి పాడ్ టాక్సీల కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు. డిసెంబరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం మెట్రో రైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ప్రాజెక్టు కోసం కేపీహెచ్‌బీ, బయోడైవర్సిటీ, అలాగే ఎల్బీ స్టేడియం, రాణిగంజ్, ఇంకా అసెంబ్లీ బేగంపేట మార్గాలను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. పీఆర్టీఎస్ విధానంలో ప్యాడ్ ట్యాక్సీలు సంచరించేందుకు ఈ మార్గాల్లో ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాక్‌లను నిర్మిస్తారు. వాటిపై ఏర్పాటు చేసే గైడ్‌వేలు, ట్రాక్‌లపై ఈ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వీటికి డ్రైవర్లు ఉండరు. అచ్చం మెట్రో రైళ్లలాగే.. ఇవి కూడా పూర్తిగా స్వయంచాలకంగా, కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ ద్వారా నడుస్తాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థలో సౌకర్యాలు ఉంటాయి. చిన్న కారు తరహాలో కనిపించే ప్యాడ్ ట్యాక్సీలలో నలుగురు నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే అవకాశం ఉంది.

అవసరమైతే ఒకేసారి 15 నుంచి 20 మంది వరకు ఉండేలా గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (జీఆర్టీ) వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ప్రయాణికులు పాడ్ కార్ ఎక్కిన తర్వాత అందులో ఉండే టచ్‌పాడ్ ద్వారా తమ గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. మెట్రో స్టేషన్లు, ప్రధాన రవాణా కేంద్రాల నుంచి సమీపంలోని వేగంగా ఐటీ పార్కులు, ఆఫీసులు, నివాస సముదాయాలకు, సంస్థ చేరుకోవడానికి ఈ పీఆర్టీఎస్ పీఆర్టీఎస్ సేవలు అందజేస్తాయి. ఇవి బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి కాబట్టి వాహన కాలుష్యం ఉండదు. ఈ ప్యాడ్ ట్యాక్సీలు గంటకు 35 నుంచి 44 వేగంతో ప్రయాణిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన విభిన్నమైన గైడ్వేలు, స్టేషన్ల డిజైన్లతో మాత్రమే ఇటువంటి పీఆర్టీఎస్ సేవలు అమలులో ఉన్నాయి.

భూమిపై నడిచే ట్రాక్‌లతో పాటు గాలిలో కేబుల్స్, పైభాగాన ట్రాక్‌లు వేలాడుతూ ప్రయాణించే వాహనాలు వంటి అనేక రకాల సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి, హైదరాబాద్ లొ ఎలివేటెడ్ ట్రాక్‌ల డిజైన్ వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. దేశంలో తొలిసారిగా ముంబయిలోని బాంద్రా, కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 8.5 పొడవైన ఎలివేటెడ్ పీఆర్టీ ప్రాజెక్టును రూపొందించారు. అక్కడ అల్ట్రా పీఆర్టీ సాంకేతికతను వినియోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.!

లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో సాంకేతికత కూడా ఇదే. యూకేకు చెందిన అల్ట్రా పీఆర్టీ సంస్థతో కలిసి హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఆ ప్రాజెక్టును చేపట్టడం. డిసెంబరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన మూడు కారిడార్లలో సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించడానికి అర్హులైన వాటిని ఖరారు చేయాల్సి ఉంటుంది.

ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రద్దీ మార్గాల్లో రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మెట్రో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా గమ్యస్థానాలకు చేరుకునే ప్రత్యామ్నాయం లభిస్తుందనే అంచనాలు నగరవాసులలో వ్యక్తమవుతున్నాయి. రానున్న దశల్లో టెండర్లు, నిర్మాణ పనులపై అందరి దృష్టి నిలవనుంది.


మీకు నచ్చవచ్చు: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ వేళ.. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు!

14 ఫ్లైఓవర్లు రద్దు: జూబ్లీహిల్స్ నుండి NFCL వరకు కొత్త సిగ్నల్ ఫ్రీ ప్లాన్!

[PRTS, PodTaxis, Hyderabad,  MetroConnectivity, KPHB Biodiversity PRTS, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird