తెలుగు ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ వచ్చేసింది. పిల్లల మధ్య పోటీ, తల్లిదండ్రుల ఆశలు, గెలుపు కోసం ప్రయత్నాల నేపథ్యంలో ప్రదర్శించిన ‘గెలుపు’ ప్రస్తుతం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా తన కొడుకు ఓడిపోకూడదనే ఉద్దేశంతో ఓ తల్లి ఎంతటి దారుణానికైనా సిద్ధపడటం ఈ కథలో ఆసక్తికరమైన అంశం.
ఈ సినిమా కథ విషయానికొస్తే ..’గెలుపు’ సినిమాలో పురుషోత్తం అనే బాలుడు చిన్న వయసులోనే ఛాంపియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు. వరుస విజయాలతో అతనికి పొగరు పెరుగుతుంది. అయితే ఓటమి ఎదురవడంతో దాన్ని తట్టుకోలేకపోతాడు. కొడుకు బాధను చూడలేని అతని తల్లి.. ఇకపై అతను ఓడిపోకుండా చూస్తానని మాటిస్తుంది.
ఇదే సమయంలో చెస్ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపిస్తూ మరో పెద్ద చిన్నారిని సైతం ఓడిస్తుంది. భవిష్యత్తులో ఆ చిన్నారి తన కొడుకుకు పోటీగా మారుతుందని భావించిన తల్లి.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంటుంది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తుంది. మరి ఆ తల్లి ప్రయత్నం ఫలించిందా? పురుషోత్తం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా ప్రముఖ ఒటిటి ప్లాట్ ఫారమ్ ఈటివి విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
