
ఆంధ్రప్రదేశ్ లో వ్యూహాత్మక ఆటంకాలు, కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో, ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే దిశగా ఎన్నికల కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా మి సంస్థలకు నోటిఫికేషన్ విడుదలైన సమయంలో, వివిధ న్యాయస్థానాలలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఈ 23 స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ నెల 26న వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరుతోంది.
ఈ విడతలో 4 నగరపాలక సంస్థలు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లితో పాటు 19 మునిసిపాలిటీల నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా స్థానిక సంస్థల డివిజన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలను అధికారులు పూర్తి చేశారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా వర్గాలకు కేటాయించాల్సిన స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పరిపాలనాపరమైన ఏర్పాట్ల జరుగుతున్నాయని ఎన్నికల సంఘం.
ఇదిచదవండి: ఏపీలో మళ్లీ ఎన్నికల రణరంగం: ఈ నెలలోనే పెండింగ్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు.!
ఈ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం, త్వరలోనే అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసి ఎన్నికల కోడ్‌ను అమలు చేయనుంది.

స్థానిక పోలింగ్ నోటిఫికేషన్ విడుదల కాన సంబంధిత ఆయా పురపాలక వర్గాల్లో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించడంతో స్థానిక ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారనుంది.
మీకునచ్చవచ్చు: ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలపై ఎస్సై కీలక ప్రకటన.!
[Court Disputes Clear, AP pending Municipalities, Elections23 Urban Local Bodies Polls, Andhra Pradesh Local Body Elections, Telugu One]
