
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు. అమరావతి ఇన్‌కోల్డ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జేకేసీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 6న గుంటూరులోని జేకేసీ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆచార్య ఎన్.జి. రంగా 1933లో రచించిన ‘హరిజన నాయకుడు’ పుస్తకాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ ఆవిష్కరించారు. అనంతరం జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌ను ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ పరుచూరి గోపీచంద్ సభాధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ కార్యక్రమంలో కందిమళ్ల శివప్రసాద్, డాక్టర్ అశోక్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి నిర్వహించారు.

ఈ క్రింది ప్రముఖులు, రచయితలు, విద్యావేత్తలతో పాటు సుమారు 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు. ఆచార్య ఎన్.జి. రంగా ఆశయాలు, సామాజిక సేవ, రచన వారసత్వాన్ని స్మరించుకుంటూ ఈ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇది కూడా చదవండి:మందు కోసమే ఏకంగా 120 కోట్లు: వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో రికార్డు స్థాయి ఖర్చులు.!
[ Acharya N.G. Ranga, N.G. Ranga 127th Birth Anniversary, Dolendra Prasad, Jameen Rythu Editor, Acharya N.G. Ranga Award, Guntur, JKC College, Amaravati Institute of Social Sciences, Yelamanchili Sivaji, Dokka Manikya Varaprasad, Harijan Nayakudu Book, Vallamreddy Lakshman Reddy, Award Ceremony, Guntur News ]
