Home సినిమా Summer Holidays Movie Review Telugu: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ – Andhra Waves

Summer Holidays Movie Review Telugu: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo



-సినిమా పేరు : ‘సమ్మర్ హాలిడేస్’
-నటీనటులు : రోహన్, అరుణ్, జయసుధ, వాసుకి, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, ఖుషి, హర్షిణి..
-మ్యూజిక్ : శింజిత్ ఎర్రమిల్లి
-ఎడిటింగ్ : సంతోష్ నాయుడు
-ఫొటోగ్రఫీ : సాయి ప్రకాష్
-బ్యానర్ నేమ్ : ధీరాజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్
-నిర్మాతలు : ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని
-రచన, దర్శకత్వం: శ్రీకర్ నయన్
-విడుదల తేదీ : నవంబర్ 6 , 2026

ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న ‘సమ్మర్ హాలిడేస్’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

రావూరి వెంకటేష్ ఉరఫ్ ఆర్. వి (అరుణ్ దేవ్) . వయసు సుమారు పదమూడేళ్లు.. కల్మషం అంటూ లేని స్వచ్ఛమైన మనసు తన సొంతం. క్రికెట్ అంటే ప్రాణం. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే బాగానే చదువుతాడు. కానీ ర్యాంకుల కోసం తండ్రి( హర్షవర్ధన్) ఫోర్స్ చేస్తుంటాడు. కానీ ఆర్. వికి అంత సీన్ లేదు. తల్లి పేరు (వాసుకి) ఆర్ వి కి ఫుల్ సపోర్ట్. తోటవారిపాలెం అనే గ్రామానికి చెందిన కాశీ వెంకటేశ్వర్లు ఉరఫ్ కెవి (రోహాన్ ). ఆర్. వి వయసే. బాగా పేదవాడు. తాగుడుకి బానిసై చిన్న వయసులోనే తండ్రి చనిపోతాడు. ఆ అప్పులు తీర్చడానికి స్కూల్ కి వెళ్తూనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడు ఫేస్‌లో డల్ నెస్ కనిపించదు. తల్లి( హర్షిణి) ఉంటుంది. తన తల్లికి మంచి చీర కొనిపెట్టాలనే ది తన లక్ష్యం. అలాంటి లైఫ్ తో కుస్తీ పడుతున్న ఆర్. వి, కెవి ఇద్దరు తోటవారిపాలెంలో కలుస్తారు. ఆ ఇద్దరు తోటవారిపాలెం లో ఎలా కలిశారు? ఏం చేసారు? ఎవరెవరు పరిచయమయ్యారు? లైఫ్ లో కొచ్చిన అదనపు సంతోషాలేంటి? నేర్చుకున్న పాఠాలు ఏంటి? అసలు సమ్మర్ హాలిడేస్ ఏ పర్పస్ తో తెరకెక్కింది అనేదే మూవీ.


ఎనాలసిస్
పాన్ ఇండియా దినుసులతో తెరకెక్కుతున్న సినిమాల మధ్య సమ్మర్ హాలిడేస్ లాంటి చిన్న సినిమా రావడం నిజంగా గ్రేట్.. ఈ విషయంలో మేకర్స్ ని నూటికి నూరు శాతం మెచ్చుకోవాల్సిందే. గలగల పారే సెలయేరుల కథ, కథనం సాగింది. కాకపోతే సెలయేరు కూడా వంపులు, పాయలు గా మారుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా! సేమ్ సమ్మర్ హాలిడేస్ పరిస్థితి కూడా అదే. సినీ ట్రిక్ లా స్క్రీన్ ప్లేలో మెరుపులు లేకపోవడం కొంచం ఇబ్బంది.

ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆర్ వి , తండ్రి, తల్లి మధ్య వచ్చిన సీన్స్ రొటీన్. చాలా సినిమాల్లో చూసేసాం. తోటివారి పాలెంకి కథ షిఫ్ట్ అవ్వగానే ఆర్. వి, కె వి మధ్య వచ్చిన అన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. చాలా మందికి బాల్యం గుర్తుకొస్తుంది. కాకపోతే కెవి ఫ్యామిలీ కష్టాలని కథ రన్ అవ్వడం కోసం కావాలని పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్త పడాల్సిందేమో. ఆర్ వి అమ్మమ్మ( జయసుధ) సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ టార్డినరీ.

సెకండ్ హాఫ్ చూసుకుంటే వచ్చిన అన్ని సీన్స్ బాగానే ఉన్నా,మనకి ముందుగానే తేలిపోస్తుంటాయి. మామిడి చెట్ల ఓనర్( రాజీవ్ కనకాల) తో పాటు ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ , పుట్టిన రోజు వేడుకలు, తల్లికి చీర కొనాలన్న కోరిక నెరవేరడం ఇలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ పర్లేదు.


నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

ఆర్. వి గా అరుణ్ దేవ్ జీవించి పడేసాడు. తనకి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందో మరోసారి చాటి చెప్పాడు. కెవి గా రోహన్ సైతం తగ్గేదెలే అనేలా చేసాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టేసాడు. హర్షవర్ధన్, వాసుకి, రాజీవ్ కనకాల బాగానే చేసినా అలాంటి నటన చాలా సినిమాల్లోనే చేసేసారు. అమ్మమ్మగా సహజ నటి జయసుధ సహజమైన నటనతో మెప్పించింది. స్కూల్ అమ్మాయిగా ఖుషి, రోహన్ తల్లిగా హర్షిణి, మహేష్ ఆచంటతో పాటు మిగిలిన నటీనటులు తమ క్యారెక్టర్ ల పరిధి మేరకు నటించారు.ఫోటిగ్రఫీ బాగుంది. సాంగ్స్ యావరేజ్ బ్యాక్ అయినా గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీకర్ నయన్ దర్శకుడిగా భారీగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది.నిర్మాణ విలువలు సూపర్


బలాలు
1 .కథ
2 .పల్లెటూరి నేపథ్యం
3 . రోహన్, అరుణ్ పెర్ఫార్మెన్స్
4 . దర్శకత్వం

బలహీనతలు
1 .ఎలాంటి కథనం వస్తుందో ముందుగానే తెలిసిపోతుంది

చివరిగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత చిన్న పిల్లల ఆనందాలు, భావోద్వేగాలని బాగానే చెప్పింది.

రేటింగ్ 2 .5/5 అరుణాచలం

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird