తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. తెలుగులో ఆయన నేరుగా సినిమా చేయకపోయినా.. డబ్బింగ్ సినిమాలతో తరచుగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ఆయన సినిమా తెలుగులో కొన్ని రీమేక్‌లు కూడా అయ్యాయి. వెట్రిమారన్ సినిమాల్లోని కంటెంట్ ఎంత సహజంగా, అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఆయన సినిమాలపై విమర్శకులు, ప్రేక్షకులు సుదీర్ఘకాలంగా ఒకే లోపాన్ని ఎత్తిచూపుతున్నారు. అదే ‘లిప్ సింక్’ (డబ్బింగ్ డైలాగులు, నటినటుల పెదవుల కదలికలు సరిపోకపోవడం) లోపం. తాజాగా, ఐఎఫ్‌పీ ఫెస్టివల్ ఈవెంట్లో పాల్గొన్న వెట్రిమారన్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ”ప్రతి ఒక్కరూ నన్ను ఈ లిప్ సింక్ గురించి అడుగుతుంటారు. దానికి నా దగ్గర ఒకే ఒక్క సమాధానం ఉంది. ఈ మాట బయటవారికే కాదు, నా టీమ్‌కు కూడా స్పష్టంగా చెప్తాను. షూటింగ్ మరియు డబ్బింగ్ సమయంలో నా టీమ్‌ను నేను ఒక్కటే అడుగుతాను.. ‘మీకు పర్ఫెక్ట్ సింక్ కావాలా లేక బలమైన కథ కావాలా?’ అని. నేను ఎప్పుడూ కథకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. మీకు ఖచ్చితంగా లిప్ సింక్ కావాలనుకుంటే, దాన్ని మీరే ఉంచుకోవచ్చు. కానీ నాకు మాత్రం కథే ముఖ్యం” అని ఆయన తేల్చి చెప్పారు.
తన వర్కింగ్ స్టైల్, మేకింగ్ ప్రాసెస్ గురించి కూడా ఆయన మాట్లాడారు.. ”నాకు ఎలాంటి ఫిక్స్డ్ రూల్స్ ఉండవు. నేను పూర్తిగా సెట్స్‌లో నా నేచురల్ థాట్స్, ఇన్స్టింక్ట్ మీదే పనిచేస్తాను. నాకు ఎడిటింగ్ టేబుల్ అంటే ఎంతగానో ఇష్టం. ఆ ప్రక్రియపై నాకు ఒక రకమైన పిచ్చి ఉంది. కొన్నిసార్లు సినిమా అధికారికంగా థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా డిటింగ్ రూమ్‌లో నేను మార్పులు చేస్తున్నాను” అని చెప్పారు.
#Vetrimaaran తన చిత్రాలలో లిప్ సింక్ సమస్యలు మరియు ప్రక్రియ గురించి:
“అందరూ నన్ను లిప్ సింక్ గురించి అడుగుతారు. నేను నా టీమ్‌ని అడిగాను, ‘మీకు సింక్ కావాలా లేదా స్టోరీ కావాలా..?’ నేను కథను ఎంచుకుంటాను.. ఒకసారి నా ప్రాసెస్ గురించి ఎవరో అడిగారు. నాకు ఎలాంటి ప్రక్రియ లేదు. నేను నాలా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను మరియు కొన్నిసార్లు సినిమాలు విడుదలైన తర్వాత కూడా వాటిని ఎడిట్ చేస్తూనే ఉంటాను.. నేను ఎప్పుడూ నా మనసులో అనుకున్న పాత్రలకు సరిపోయే నటులనే ఎంపిక చేసుకుంటాను, సంప్రదాయబద్ధంగా ఆ పాత్రలను సౌకర్యవంతంగా పోషించగల నటులను ఎన్నుకోవడం కంటే..” https://t.co/GjdGFyhSYJ
— లక్ష్మీకాంత్ (@iammoviebuff007) అక్టోబర్ 26, 2026

